News August 19, 2024

HYD: ఏడో తరగతి బాలికపై లైంగిక దాడి

image

బాలికపై ఓ వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాలు.. సైదాబాద్ డివిజన్‌లోని బస్తీవాసి (58) కేంద్ర ప్రభుత్వ సంస్థలో కింది స్థాయి ఉద్యోగిగా పనిచేస్తున్నాడు. ఇంటి పక్కన ఉండే ఏడో తరగతి చదువుతున్న బాలికకు చాక్లెట్ల ఆశ చూపి ఇంట్లోకి పిలిచాడు. అనంతరం బాలికపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈనెల 11న ఘటన జరగగా.. బాలిక కుటుంబసభ్యులు 13న ఫిర్యాదు చేశారు. కేసు నమోదైంది.

Similar News

News September 13, 2024

ప్రజా పాలన దినోత్సవ నిర్వహణ కోసం విస్తృత ఏర్పాట్లు చేయండి: సీఎస్

image

ఈనెల 17న HYD పబ్లిక్ గార్డెన్‌లో ప్రజా పాలన దినోత్సవాన్ని నిర్వహించనున్నట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు. ప్రజా పాలన దినోత్సవ నిర్వహణ ఏర్పాట్లపై గురువారం సచివాలయంలో అధికారులతో ఉన్నత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సెక్రటరీ రవిగుప్తా, సిటీ సీపీ సీవీ ఆనంద్ తదితరులు పాల్గొన్నారు.

News September 13, 2024

HYD: డీజీపీ ఎమర్జెన్సీ రివ్యూ.. శాంతిభద్రతలపై టెలి కాన్ఫరెన్స్

image

ఇటీవలి పరిణామాలను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ పోలీస్ కమిషనర్లతో డీజీపీ జితేందర్ ఐపీఎస్ సమావేశం నిర్వహించారు. హైదరాబాద్‌లోని ట్రై కమిషనరేట్‌లలో శాంతిభద్రతల విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఉద్ఘాటించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరైనా ప్రయత్నిస్తే చట్ట ప్రకారం కఠినంగా వ్యవహరించాలన్నారు.

News September 13, 2024

హైదరాబాద్‌లో ఇరాన్ టూరిజం శాఖ రోడ్‌షో

image

భారత్-ఇరాన్ పర్యాటక సహకారమే లక్ష్యంగా ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఆధ్వర్యంలో సాంస్కృతిక, చారిత్రక, సహజ వైవిధ్యాన్ని తెలిపేలా ఇరాన్ టూరిజం శాఖ హైదరాబాద్‌లోని ఓ హోటల్‌లో గురువారం రోడ్‌షో నిర్వహించింది. ఇరాన్ టూరిజం ఉపమంత్రి అలీ అస్గర్ షాల్బాఫియాన్, తెలంగాణ టూరిజం మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. జనవరి 2024 నుంచి భారతీయులకు ప్రతీ 6 నెలల్లో 15 రోజుల పాటు వీసా రహిత ప్రయాణాన్ని ఇరాన్ ప్రకటించింది.