News January 12, 2025
HYD: ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుంది: దానం

ఏది మాట్లాడినా సెన్సేషన్ అవుతుందని MLA దానం నాగేందర్ అన్నారు. ఖైరతాబాద్లో ఆయన మాట్లాడుతూ.. ఈ కార్ రేసుతో HYD ఇమేజ్ పెరిగిందన్నాను.. కానీ అవినీతి జరగలేదని చెప్పలేదన్నారు. కంటి తుడుపు చర్యల్లా మూసీ వద్ద నాయకులు ఒక్కరోజు నిద్ర చేశారన్నారు. అక్కడికి వెళ్లే ముందే ACలు పెట్టించుకుని పడుకున్నారన్నారు. అక్కడివారు చేసిన జొన్న రెట్టేలు కాకుండా కిషన్ రెడ్డి బయట నుంచి ఇడ్లీలు తెప్పించుకున్నారని ఆరోపించారు.
Similar News
News December 8, 2025
ఫ్యూచర్ సిటీలోని ప్రదర్శన స్టాల్ వద్ద సందడి!

ఫ్యూచర్ సిటీలో ప్రదర్శన స్టాల్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మీర్ఖాన్పేటలో ప్రతిపాదించిన ఈ భవిష్యత్తు నగర ప్రణాళికలను డిజిటల్ విజువల్స్ ద్వారా ప్రదర్శించారు. వంపు ఆకృతి నిర్మాణంతో కూడిన ఈ స్టాల్లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ను అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్టాల్ను సందర్శించారు.
News December 8, 2025
HYD: 2 రోజుల కోసం 2 నెలలుగా ప్రత్యేక దృష్టి

నేడు, రేపు ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ను విజయవంతం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి 2 నెలల ముందునుంచే అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. నిత్యం సమీక్షలు, ఏర్పాట్లు, అతిథులు, ఆహ్వానాలు.. ఇలా అన్నింటిని తానే నడిపించారు. ఎక్కడా.. పొరపాట్లు దొర్లకుండా అధికారులకు బాధ్యతలు అప్పగించారు. ఢిల్లీకి వెళ్లి ప్రధాని, రాహుల్ గాంధీని ఆహ్వానించారు. వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు తీసుకురావాలనేది సీఎం ఆశయం.
News December 8, 2025
సీఎం సరికొత్త ఆలోచన.. HYDలో డొనాల్డ్ ట్రంప్ రోడ్

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు ఇపుడు హైదరాబాద్లోని ఓ రోడ్డుకు పెట్టనున్నారు. ఇందుకు సంబంధించి ప్రభుత్వం ప్రతిపాదనలు సిద్ధం చేసింది. సిటీలోని అమెరికన్ కాన్సులేట్ జనరల్ వద్ద ఉన్న రోడ్డుకు డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ అని నామకరణం చేయాలని సర్కారు నిర్ణయించింది. అయితే ఇది ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ విషయాన్ని కేంద్రానికి, యూఎస్ ప్రభుత్వానికి తెలంగాణ సర్కార్ లేఖ రాయనున్నట్లు సమాచారం.


