News October 7, 2024

HYD: ఏపీ సీఎం CBNను కలిసిన మాజీ మంత్రి మల్లారెడ్డి

image

మేడ్చల్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి, మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి సోమవారం ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా కలిశారు. మర్రి రాజశేఖర్ రెడ్డి కుమార్తె శ్రేయ రెడ్డి వివాహం సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు శుభలేఖను అందజేసి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి ఉన్నారు.

Similar News

News January 21, 2026

విద్యార్థులకు ALERT.. ఏకలవ్య పాఠశాలల్లో ADMISSIONS

image

TGలోని 23 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్‌లో ఆరో తరగతి ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదలైంది. 2026-27 విద్యా సంవత్సరానికి మొత్తం 1380 సీట్లను భర్తీ చేయనున్నారు. నేటి నుంచి ఫిబ్రవరి 20వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. మార్చి 29న నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక ఉంటుంది. అర్హులైన విద్యార్థులు https://tsemrs.telangana.gov.in ద్వారా అప్లై చేసుకోవాలని అధికారులు సూచించారు. SHARE IT.

News January 21, 2026

HYD: ఈ నగరానికి ఏమైంది.. ఒకేరోజు 3 హత్యలు..?

image

వరుస హత్యలతో HYD హడలెత్తుతోంది. అక్రమ సంబంధాలు, గంజాయి మత్తు మానవత్వాన్ని దహించేస్తోంది. మంగళవారం జరిగిన 3 హత్యలు నగరాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. జవహర్‌ నగర్‌లో గంజాయి మత్తులో కన్నతల్లినే కొడుకు కిరాతకంగా హతమార్చాడు. కూకట్‌పల్లిలో జల్సాలకు అడ్డొస్తున్నాడని భర్తను ఉరేసి ఉసురు తీసింది కసాయి భార్య. బోరబండలో భార్యపై అనుమానంతో రోకలి బండతో కొట్టి చంపాడో <<18912212>>దుర్మార్గపు భర్త.<<>> నేరచీకట్లలో నగరం కమ్ముకుపోతోంది.

News January 21, 2026

HYD: వందేళ్లు దాటినా.. చెక్కుచెదరని ‘ప్యాలెస్ రాజసం’

image

HYD.. తన గుండెలపై ఘన చరిత్రను మోస్తోంది. చెక్కుచెదరని వందలేళ్ల చారిత్రక కట్టడాలు కళ్లు చెదిరేలా మెరిసిపోతున్నాయి. బేగంపేటలోని పైగా ప్యాలెస్‌కు 126 ఏళ్లు నిండినా, నేటికీ అదే వైభవంతో వెలిగిపోతోంది. విఖార్ ఉల్ ఉమ్రా నియో-క్లాసికల్ శైలిలో నిర్మించిన ఈ రెండంతస్తుల భవనం 4ఎకరాల్లో విస్తరించింది. 1975-2008 వరకు HUDA కార్యాలయంగా, 2023 వరకు అమెరికా కాన్సులేట్‌గా సేవలందించింది. త్వరలో HMDA ఆఫీస్‌గా మారనుంది.