News March 24, 2025
HYD: ఏప్రిల్ 1 నుంచి స్కిల్ ఎడ్యుకేషన్ మేళా

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గల సాఫ్ట్వేర్ స్కిల్ కోర్సుల్లో విద్యార్దులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల పాటు స్కిల్ ఎడ్యుకేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మణికొండలోని కార్యాలయంలో స్వయంగా గాని, ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News March 30, 2025
NZB: యువకుడి ఆత్మహత్యాయత్నం

బెట్టింగ్ యాప్‌లో డబ్బులు పోగొట్టుకున్న యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ ఘటన నిజామాబాద్ జిల్లా రూరల్ మండలం ఆకుల కొండూరు గ్రామంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన ఆకాశ్ ఆన్‌లైన్‌లో బెట్టింగ్‌కు పాల్పడి సుమారు రూ.3 లక్షల వరకు నష్టపోయాడు. దీంతో గడ్డి మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు NZBలో ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం యువకుడు చికిత్స పొందుతున్నాడు.
News March 30, 2025
గవర్నర్‌తో సీఎం భేటీ.. మంత్రివర్గ విస్తరణపైనే చర్చ?

TG: హైదరాబాద్ రాజ్‌భవన్‌లో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో సీఎం రేవంత్ మర్వాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఆయనకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. దాదాపు గంట సేపు జరిగిన సమావేశంలో మంత్రి వర్గ విస్తరణపై చర్చించినట్లు సమాచారం. ఏప్రిల్ 3న కొత్త మంత్రులతో ప్రమాణస్వీకార కార్యక్రమం ఉండే అవకాశం ఉంది.
News March 30, 2025
పర్యాటక అభివృద్ధే లక్ష్యం: కలెక్టర్

ఎన్టీఆర్ జిల్లాను రాష్ట్రంలో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ లక్ష్మీశ పిలుపునిచ్చారు. సీఎం చంద్రబాబు విజన్ 2047ను సాధించాలంటే ఇప్పటి నుంచే పక్క ప్రణాళికతో ముందుకు సాగాలన్నారు. పర్యాటక అభిరుద్దితో జిల్లాను ముందంజులో నడపాలన్నారు. అనంతరం సమీక్షా సమావేశంలో భాగంగా మంత్రి సత్యకుమార్ యాదవ్, జిల్లా మహిళా ఉన్నతాధికారులతో కొండపల్లి కోట వద్ద కలెక్టర్ ఫొటో దిగారు.