News March 24, 2025
HYD: ఏప్రిల్ 1 నుంచి స్కిల్ ఎడ్యుకేషన్ మేళా

కేంద్ర ప్రభుత్వ ఆమోదిత నేషనల్ స్కిల్ అకాడమీ ఆధ్వర్యంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలు గల సాఫ్ట్వేర్ స్కిల్ కోర్సుల్లో విద్యార్దులకు ఆన్లైన్ ద్వారా శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నట్లు అకాడమీ డైరెక్టర్ వెంకట్ రెడ్డి తెలిపారు. ఏప్రిల్ 1 నుంచి 15 రోజుల పాటు స్కిల్ ఎడ్యుకేషన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. మణికొండలోని కార్యాలయంలో స్వయంగా గాని, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు.
Similar News
News October 24, 2025
హైదరాబాద్ వాతావరణ సమాచారం

నగరంలో ఈ సాయంత్రం ఆకాశం మేఘావృతంగా ఉండి, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు, ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఈదురు గాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీస్తాయని అంచనా వేసింది. ఉదయం వేళ పొగమంచు ఉంటుందని, గరిష్ఠ ఉష్ణోగ్రత 27°C, కనిష్ఠం 22°C గా ఉంటుందని ఉంటుందని పేర్కొంది.
News October 24, 2025
ఓయూ: MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీల ఖరారు

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలోని MA ఇంటర్నేషనల్ స్టడీస్ పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఈ కోర్సు రెగ్యులర్ పరీక్షలను వచ్చే నెల 6వ తేదీ నుంచి నిర్వహించనున్నట్లు చెప్పారు. పరీక్షా తేదీల పూర్తి వివరాలను ఓయూ వెబ్సైట్ www.osmania.ac.inలో చూడొచ్చని సూచించారు.
News October 24, 2025
ఓయూలో వాయిదా పడిన కోర్సుల పరీక్షా తేదీల ఖరారు

ఓయూ పరిధిలో ఈ నెల 18న బీసీ బంద్ నేపథ్యంలో వాయిదా పడిన వివిధ కోర్సుల పరీక్షా తేదీలను ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ శశికాంత్ తెలిపారు. ఎమ్మెస్సీ అప్లైడ్ న్యూట్రిషన్, ఎమ్మెస్సీ స్పోర్ట్స్ న్యూట్రిషన్ నాలుగో సెమిస్టర్ పరీక్షలను తిరిగి ఈ నెల 29వ తేదీన నిర్వహిస్తామని చెప్పారు. పరీక్షా కేంద్రం, సమయంలలో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేశారు.


