News March 25, 2025
HYD: ఏప్రిల్ 7 నుంచి 10 వరకు స్పోర్ట్స్ మీట్

GHMC ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, ఉద్యోగులు, సిబ్బంది, మీడియా ప్రతినిధులకు ఏప్రిల్ 7 నుంచి 10 వరకు స్పోర్ట్స్ మీట్ నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్ అదనపు కమిషనర్ యాదగిరి రావు తెలిపారు. విక్టరీ ప్లే గ్రౌండ్, ఉప్పల్ స్టేడియంలో APR 7 నుంచి 10 వరకు జరుగుతాయి. పురుషులకు క్రికెట్, కబడ్డీ, వాలీబాల్ పోటీలున్నాయి. చెస్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పురుషులు, మహిళలు పాల్గొనవచ్చు. ఇండోర్స్ గేమ్స్ కూడా ఉన్నాయి.
Similar News
News April 19, 2025
నాగర్‌కర్నూల్: నీ సీఎం కుర్చీ గుంజేస్తాం రేవంత్ రెడ్డి: తీన్మార్ మల్లన్న

నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో బీసీ చైతన్య సభను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిథిగా ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న హాజరయ్యారు. SLBCలో చనిపోయిన వారిలో ఏడుగురు బీసీలకు ఆయన నివాళులర్పించారు. మల్లన్న మాట్లాడుతూ.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ ఇవ్వకుండా నోటిఫికేషన్లకు వెళ్తే ఊరుకోబోమని, రేవంత్ రెడ్డి సీఎం కుర్చీని గుంజేస్తామంటూ హెచ్చరించారు. రాష్ట్ర బీసీ నాయకులు పాల్గొన్నారు.
News April 19, 2025
రామప్ప కనుమరుగయ్యే అవకాశం ఉంది: పాండురంగారావు

సింగరేణి ఓపెన్ కాస్ట్‌కు ప్రభుత్వం అనుమతులు ఇస్తే రాబోయే రోజుల్లో రామప్ప ఆలయం కనుమరుగయ్యే అవకాశం ఉందని కాకతీయ హెరిటేజ్ ట్రస్టు వ్యవస్థాపకుడు ప్రొఫెసర్ పాండురంగారావు అన్నారు. వెంకటాపూర్‌లోని ఆలయాన్ని సందర్శించి వారు మాట్లాడారు. రామప్ప దేవాలయం పరిరక్షణలో అందరూ భాగస్వాములు కావాలన్నారు. 800 ఏళ్ల చరిత్ర కలిగి, వారసత్వ సంపదగా గుర్తింపు పొందిన రామప్ప దేవాలయం జిల్లాకే గర్వకారణమన్నారు.
News April 19, 2025
ఫార్ములా ఈ-రేసు కేసు.. రెండో విడత దర్యాప్తు!

TG: ఫార్ములా ఈ-రేసు కేసులో రెండో విడత దర్యాప్తు కోసం ఏసీబీ ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే కేటీఆర్ సహా 24 మంది స్టేట్‌మెంట్లు రికార్డు చేసిన అధికారులు, మరో 10 మందికి నోటీసులిచ్చి ప్రశ్నించాలని నిర్ణయించారు. HMDA బోర్డు నిధుల నుంచి రూ.55 కోట్లు విదేశీ సంస్థకు అక్రమంగా చెల్లించారన్న ఆరోపణలపై ఏసీబీ దర్యాప్తు కొనసాగుతోన్న సంగతి తెలిసిందే.