News September 22, 2024
HYD: ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్షల తేదీలు ఖరారు!

ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో వాయిదా పడిన ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ పరీక్ష తేదీని ఖరారు చేసినట్లు ఓయూ కంట్రోలర్ ఆఫ్ ది ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ రాములు తెలిపారు. ఈ నెల 17న గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. దీంతో ఆరోజు జరగాల్సిన అన్ని పరీక్షలను అధికారులు వాయిదా వేశారు. ఈ పరీక్షను వచ్చే నెల 16న నిర్వహించనున్నట్లు, పరీక్ష సమయం, పరీక్ష కేంద్రంలో ఎలాంటి మార్పు ఉండదన్నారు.
Similar News
News November 19, 2025
నాంపల్లి కోర్టులో ఐబొమ్మ రవి బెయిల్, కస్టడీపై విచారణ

నాంపల్లి కోర్టులో ఐ బొమ్మ రవికి సంబంధించిన కస్టడీ పిటిషన్‌పై ఇవాళ విచారణ జరగనుంది. రవిపై పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. మరోవైపు నిందితుడు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం, ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇవ్వాళ ఇరు వాదనల విచారించి తీర్పు ఇవ్వనుంది.
News November 19, 2025
HYD: రాహుల్ సిప్లిగంజ్ వివాహం.. సీఎంకి ఆహ్వానం

రాహుల్ సిప్లిగంజ్ ఇటీవల ఆగస్టులో తను ప్రేమించిన అమ్మాయి హరిణ్య రెడ్డితో నిశ్చితార్థం చేసుకున్నారు. వారి వివాహానికి నవంబర్ 27న పెద్దలు ముహూర్తం నిశ్చియించారు. ఈ వివాహానికి సినీ, రాజకీయ ప్రముఖులు భారీగా హాజరు కానున్నట్టు సమాచారం. తాజాగా రాహుల్ సిప్లిగంజ్ తనకు కాబోయే భార్య హరిణ్యరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డిని కలిసి.. తన వివాహానికి ఆహ్వానించారు.
News November 19, 2025
సా.4 గంటల వరకు సచివాలయ ఉద్యోగులకు వైద్యశిబిరం

రాష్ట్ర సచివాలయంలో ఈ రోజు ఉద్యోగులకు వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాస్ తెలిపారు. ఉ.11 గంటలకు ప్రారంభమయ్యే శిబిరం సా.4 గంటల వరకు ఉంటుందన్నారు. నిపుణులైన డాక్టర్లు వైద్య సేవలందిస్తారని.. సచివాలయ ఉద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ప్రతి ఒక్కరూ ఆరోగ్య స్పృహ కలిగి ఉండాలని ఈ సందర్భంగా ఆయన సూచించారు.


