News March 20, 2025
HYD: ఒక్కో IPL మ్యాచ్.. రూ.1.5 కోట్లు..!

ఉప్పల్ స్టేడియం వెన్యూను SRH వాళ్లు రెంట్‌కు తీసుకుంటారని ప్రతి IPL మ్యాచ్ కోసం రూ.1.5 కోట్లు తమకు చెల్లిస్తారని HCA ప్రెసిడెంట్ అన్నారు. IPL మ్యాచులలో HCA పాత్ర పరిమితంగా ఉంటుందని, మిగతా వాటిల్లో HYD ఉప్పల్ స్టేడియం మొత్తం HCA కంట్రోల్లో ఉంటుందని ప్రెసిడెంట్ జగన్ మోహన్‌రావు తెలిపారు. దీంతో హౌస్ కీపింగ్, క్లీనింగ్ లాంటి సదుపాయాలు కల్పిస్తామే తప్ప, టికెట్ల ధరలు తమ కంట్రోల్లో ఉండవన్నారు.
Similar News
News March 21, 2025
పాకిస్థాన్.. నీ ఆట ఊహాతీతం!

అంతర్జాతీయ క్రికెట్లో అత్యంత అస్థిరమైన ఆటతీరు కనబర్చే జట్టుగా పాకిస్థాన్‌కు పేరుంది. NZతో టీ20 సిరీస్‌లో ఆ పేరును మరోసారి సార్థకం చేసుకుంది. సిరీస్‌లో తొలి మ్యాచ్‌లో కేవలం 91 పరుగులకే చాప చుట్టేసిన పాక్, రెండో టీ20లో 135 పరుగులు చేసి ఓడింది. అదే జట్టు ఈరోజు జరిగిన 3వ టీ20లో 204 పరుగుల్ని 16 ఓవర్లలో ఛేదించేసింది. అంతర్జాతీయ టీ20ల చరిత్రలోనే 200 రన్స్‌ను ఇంత వేగంగా ఛేదించిన తొలి జట్టుగా నిలిచింది.
News March 21, 2025
సీఐఎస్ఎఫ్ చూపుతున్న దేశభక్తి ప్రశంసనీయం: కలెక్టర్

ర్యాలీలో పాల్గొన్న సీఐఎస్ఎఫ్ సిబ్బందిని కలెక్టర్ డీకే బాలాజీ అభినందిస్తూ వారు చూపుతున్న దేశభక్తి, అంకితభావం ప్రశంసనీయమన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. సీఐఎస్ఎఫ్ దేశం నలుమూలల అంతర్గత పరిరక్షణలో ప్రముఖ పాత్ర పోషిస్తోందన్నారు. ప్రజల సహకారంతోనే ప్రభుత్వం ముందడుగు వేయడానికి వీలుందన్నారు. ప్రజలను భాగస్వామ్యులుగా చేయాలనే ఉద్దేశంతో సీఐఎస్ఎఫ్ బృహత్తర కార్యక్రమం చేపట్టిందన్నారు.
News March 21, 2025
సంగారెడ్డి: ఏప్రిల్ 7 నుంచి టెన్త్ జవాబు పత్రాల మూల్యాంకనం

రామచంద్రపురం మండల కేంద్రంలోని సెయింట్ ఆర్నాల్డ్ ఉన్నత పాఠశాలలో ఏప్రిల్ 7 నుంచి 15 వ తేదీ వరకు పదో తరగతి జవాబు పత్రాల మూల్యాంకనం నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు గురువారం తెలిపారు. మూల్యాంకనం విధులు కేటాయించిన ఉపాధ్యాయులు తప్పకుండా హాజరు కావాలని సూచించారు.