News April 16, 2025
HYD: ఒక్క క్లిక్‌తో చేతిలో భూ వివరాలు..!

ORR పరిధిలో భూముల వివరాలు అందరికీ అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం హైడ్రా కసరత్తు ప్రారంభించింది. చెరువు ఎక్కడ ఉంది? ఆ చెరువు విస్తీర్ణం ఎంత? కాలువలు, నాలాల పరిస్థితి ఏంటి? అనే సమాచారంతో పాటు ప్రభుత్వ భూములు, పార్కులకు సంబంధించి హద్దుల సమాచారాన్ని సేకరిస్తోంది. ఇందులో భాగంగా NRSCతో MOU ఒప్పందం కుదుర్చుకుంది.
Similar News
News October 17, 2025
సీఎం అభినందనలు అందుకున్న నక్కపల్లి విద్యార్థిని

నక్కపల్లి గర్ల్స్ హైస్కూల్‌లో 9వ తరగతి చదువుతున్న బాలిక కె.చైత్రినిని అమరావతిలో సీఎం చంద్రబాబు శుక్రవారం సాయంత్రం అభినందించారు. సూపర్ జీఎస్టీ -సూపర్ సేవింగ్స్ అనే అంశానికి సంబంధించి నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో చైత్రని అద్భుతమైన పెయింటింగ్ వేసింది. ఈ పెయింటింగ్ రాష్ట్ర స్థాయిలో మన్ననలు పొందటంతో విద్యార్థిని ప్రతిభను సీఎం ప్రశంసించారని ఆర్జేడి విజయభాస్కర్, ప్రిన్సిపల్ శ్రీలక్ష్మి తెలిపారు.
News October 17, 2025
రంగారెడ్డి: స్వీట్ షాప్‌లపై ఫుడ్ సేఫ్టీ అధికారుల స్పెషల్ డ్రైవ్

దీపావళి పండుగ సందర్భంగా రంగారెడ్డి జిల్లాలోని స్వీట్స్ తయారీ కేంద్రాల్లో జిల్లా ఆహార భద్రత అధికారులు తనిఖీలు చేపట్టారు. తయారీకి ఉపయోగించే పదార్థాలు, నాణ్యతపై స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. ప్రజలు స్వీట్స్ కొనేముందు వాటి నాణ్యతను గమనించి కొనాలని, తినే పదార్థాల్లో నాణ్యత లోపిస్తే ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. జోనల్ ఆఫీసర్ ఖలీల్, జిల్లా అధికారి మనోజ్, ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్ జగన్ పాల్గొన్నారు.
News October 17, 2025
తిన్న వెంటనే నడుస్తున్నారా?

భోజనం చేశాక నడిస్తే ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే తిన్న వెంటనే కాకుండా 10-15 నిమిషాల తర్వాత వాకింగ్ చేస్తే మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. తిన్న వెంటనే నడిస్తే కడుపు ఉబ్బరంగా అనిపించవచ్చని చెబుతున్నారు. భోజనం చేశాక 30 నిమిషాల పాటు వాకింగ్ చేస్తే త్వరగా జీర్ణం అవుతుందని, బరువు తగ్గుతారని సూచిస్తున్నారు.
Share it