News January 26, 2025
HYD: ఒక కిలోమీటర్ మెట్రోకు రూ.317 కోట్లు..!

HYD మెట్రో ప్రాజెక్టు ఫేజ్-2లో పార్ట్-A కింద 5 మెట్రో కారిడార్ల డీటెయిల్డ్ ప్రాజెక్టు రిపోర్టులు (DPR) సిద్ధమైనట్లు సీఎం రేవంత్ రెడ్డి కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. 76.4KM మెట్రోకు రూ.24,269 కోట్ల ఖర్చు అవుతుందని రిపోర్టులో ఉంది. అంటే సుమారు 1KM మెట్రోకు రూ.317 కోట్లు.ఈ ప్రాజెక్టు రిపోర్టులను కేంద్రం ఆమోదించాలని,కేంద్ర,రాష్ట్ర భాగస్వామ్యంతో నిర్మించడానికి నిధులు విడుదల కేటాయించాలని కోరారు.
Similar News
News September 16, 2025
సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్కు దరఖాస్తులు ఆహ్వానం

డిగ్రీ, PG, మెడిసిన్, ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు సెంట్రల్ సెక్టార్ స్కాలర్షిప్ స్కీమ్ పేరుతో కేంద్రం స్కాలర్షిప్ అందిస్తోంది. డిగ్రీ విద్యార్థులకు ఏటా రూ.12వేల చొప్పున మూడేళ్ల వరకు, PG విద్యార్థులకు రూ.20వేల చొప్పున రెండేళ్ల వరకు అందిస్తారు. దరఖాస్తుకు చివరి తేదీ అక్టోబర్ 31. వెబ్సైట్: https://scholarships.gov.in/
News September 16, 2025
మల్దకల్: భర్తపై వేడి నూనె పోసిన భార్య

భార్యాభర్తల మధ్య మనస్పర్థలు తీవ్రస్థాయికి చేరుకోవడంతో భర్తపై భార్య కాగుతున్న వేడి నూనె పోసింది. ఈ ఘటన గద్వాల(D) మల్దకల్ (M) మల్లెందొడ్డిలో ఆలస్యంగా వెలుగు చూసింది. వెంకటేశ్ అతడి భార్య పద్మ ఈనెల 11న గొడవపడ్డారు. దీంతో ఆగ్రహించిన భార్య అతడిపై వేడి నూనె పోసింది. వెంకటేశ్ను చికిత్స నిమిత్తం కర్నూల్ తరలించగా సోమవారం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
News September 16, 2025
HYD: 24 గంటలు గడిచినా కనిపించనిజాడ

భారీ వర్షానికి వరద పోటెత్తడంతో ఆదివారం రాత్రి నాలాలో గల్లంతైన మాన్గార్ బస్తీకి చెందిన అర్జున్, రామా జాడ ఇప్పటివరకు లభించలేదు. ఆదివారం రాత్రి నుంచి DRF, GHMC రెస్క్యూ టీమ్లు తీవ్రంగా గాలిస్తున్నాయి. మూసీ నదిలోనూ ముమ్మరంగా గాలింపు ప్రక్రియ కొనసాగుతోంది. వారిద్దరు నాలాలో కొట్టుకొని పోవడంతో అఫ్జల్ సాగర్ ప్రాంతంలో విషాదఛాయలు అలుముకున్నాయి.