News May 8, 2024

HYD: ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలి: రోనాల్డ్ రాస్

image

ఓటు వేసి దేశభక్తిని చాటుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని HYD ఎన్నికల అధికారి రోనాల్డ్ రాస్ తెలిపారు. GHMC ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆంధ్ర ప్రాంతం వారైనా, ఇతర రాష్ట్రాల వాసులైనా నగరంలో ఓటు ఉన్నవారు, ఇక్కడే ఓటు వేయాలని సూచించారు. రెండు ప్రాంతాల్లో ఓటు హక్కును కలిగి ఉండటం చట్ట విరుద్ధమని, అలాంటి వారిపై కేసు నమోదు చేస్తామని తెలిపారు.

Similar News

News November 27, 2024

హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు

image

HYDలో వరుస అగ్ని ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. మంగళవారం <<14722224>>జీడిమెట్ల<<>>లోని కంపెనీలో భారీ ఎత్తున మంటలు చెలరేగాయి. ఆ మంటలు చల్లారకముందే <<14721016>>మణికొండ<<>>, <<14721091>>రామంతాపూర్‌<<>>లో‌ రెండు సంఘటలు వెలుగుచూశాయి. 2024లో ఇప్పటివరకు HYD, MM, RRలో 1550కి పైగా ప్రమాదాలు జరగడం ఆందోళనకరం. ఇందులో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో జరిగిన ప్రమాదాలే ఎక్కువ. దీనిపై చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

News November 27, 2024

HYD, రంగారెడ్డి రీజియన్: RTCలో 289 కాంట్రాక్ట్ ఉద్యోగాలు

image

మాజీ సైనికులను RTC డ్రైవర్లుగా నియమించాలని రాష్ట్ర ఆర్టీసీ, సైనిక సంక్షేమ శాఖలు నిర్ణయించాయి. HYD రీజియన్‌లో 117, ఉమ్మడి RRలో 172 పోస్టుల్లో కాంట్రాక్టు విధానంలో రిటైర్డ్ సైనికులతో భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశాయి. ఈ నెల 30 వరకు ప్రాంతీయ సైనిక సంక్షేమ కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించాయి. ఎంపికైన వారికి నెలకు రూ.26వేల జీతంతో పాటు రోజుకు రూ.150 చొప్పున అలవెన్స్ రూపంలో ఇవ్వనున్నారు.
SHARE IT

News November 27, 2024

హైదరాబాద్: సెల్ ఫోన్ డ్రైవింగ్.. యముడి పిలుపు!

image

రోడ్డు ప్రమాదాల నివారణకు HYD పోలీసులు నడుం బిగించారు. ఎప్పటికప్పుడు వాహనదారులను అప్రమత్తం చేస్తున్నారు. CYB, HYD, రాచకొండ కమిషనరేట్ సోషల్ మీడియా అకౌంట్లలో నిత్యం సూచనలు చేస్తున్నారు. తాజాగా రాంగ్ రూట్, సెల్ ఫోన్ డ్రైవింగ్‌పై ఫోకస్ పెట్టారు. ‘సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకండి. బహుశ అది యముడి పిలుపు కావొచ్చు’ అని పంజాగుట్టలో ఉన్న ఓ బోర్డు ఆలోచింపజేస్తోంది. Follow Traffic Rules.
Share it