News November 6, 2024
HYD: ఓటు హక్కు లేదా..? ఇది మీకోసమే..!
18 ఏళ్లు నిండి, ఇప్పటికీ ఓటు హక్కు లేని వారు వెంటనే ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకోవాలని CEO సుదర్శన్ రెడ్డి సూచించారు. నవంబర్ 28 వరకు నూతన ఓటరు దరఖాస్తు, మార్పు చేర్పులకు అవకాశం ఉందన్నారు. జనవరి 6న SSR-2025 విడుదల చేస్తామన్నారు. తాజాగా హైదరాబాద్లో-1,81,875, రంగారెడ్డి-1,18,513, మేడ్చల్ మల్కాజిగిరి-99,696 మంది నూతన ఓటర్లు కొత్తగా నమోదయినట్లుగా పేర్కొన్నారు.
Similar News
News November 23, 2024
రేపు ఓయూలో ప్రవేశ పరీక్ష
ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోని పీజీ అడ్మిషన్స్ కార్యాలయం ప్రాంగణంలోని డిస్టెన్స్ ప్రవేశ పరీక్షకు ఏర్పాట్లు చేసినట్లు పీజీ అడ్మిషన్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ పాండురంగారెడ్డి తెలిపారు. ఓయూ ఎంబీఏ (ఈవెనింగ్) 2 ఏళ్ల కోర్సు ప్రవేశ పరీక్షను రేపు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
News November 22, 2024
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మాసిస్టులు బాధ్యతతో పని చేయాలి: రాజనర్సింహ
ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫార్మసిస్టులు బాధ్యతతో పని చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ అన్నారు. శుక్రవారం సచివాలయంలో సెంట్రల్ మెడికల్ స్టోర్స్ బలోపేతంపై ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో కృత్రిమ మందుల కొరత పై చర్యలు చేపట్టాలని ఆయా జిల్లాల వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాదికారులను ఆదేశించారు. హెల్త్ ఫెసిలిటీ పనితీరుపై సమీక్షలో చర్చించారు.
News November 22, 2024
HYD: ముగిసిన రాష్ట్రపతి పర్యటన
HYD మాదాపూర్లోని శిల్పారామం వేదికగా జరిగిన లోక్ మంథన్ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు పాల్గొన్న విషయం తెలిసిందే. కాగా రాష్ట్రపతి హైదరాబాద్లో రెండు రోజుల పర్యటన ముగిసింది. రెండు రోజుల హైదరాబాద్ పర్యటన ముగించుకుని ఢిల్లీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము బయలుదేరారు. బేగంపేట విమానాశ్రయంలో మంత్రి సీతక్క, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆమెకు వీడ్కోలు పలికారు.