News May 13, 2024

HYD: ఓటేసిన రాచకొండ సీపీ 

image

సికింద్రాబాద్ పరిధి గోపాలపురంలో ఉన్న St.ప్యాట్రిక్ స్కూల్‌లో రాచకొండ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ప్రజలు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలని సూచించారు. పకడ్బందీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామన్నారు.

Similar News

News October 7, 2024

HYD: కేంద్ర హోం మంత్రిని కలిసిన సీఎం

image

భారీ వర్షాలు, వరదల కారణంగా దెబ్బతిన్న మౌలిక వసతుల పునరుద్ధరణ, మరమ్మతులకు రూ. 11,713.49 కోట్లు స‌త్వ‌ర‌మే విడుద‌ల చేయాల‌ని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాను ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విజ్ఞ‌ప్తి చేశారు. ఆయనను ఢిల్లీలో కలిసి వరద నష్టంపై సమగ్రమైన నివేదికను అందించి తగిన విధంగా ఆదుకోవాలని కోరారు. అదేవిధంగా రాష్ట్రానికి ఐపీఎస్‌ల కేటాయింపు వంటి పలు అంశాలపై చర్చించి, సహకరించాలని కోరారు.

News October 7, 2024

HYD: నగరంలో ఇక కొత్త టెక్నాలజీతో సమస్యలకు చెక్

image

HYD అమీర్‌‌పేట్ ప్రధాన రహదారి శ్రీనగర్ కాలనీ ఆటో స్టాండ్ వద్ద సీవరేజి ఓవర్ ఫ్లో సమస్యను పరిష్కరించేందుకు జలమండలి ట్రెంచ్‌ లెస్ సాంకేతికతను అమలు చేయనుంది. మెట్రో పనుల సమయంలో సీవరేజి అలైన్‌మెంట్ దెబ్బతినడంతో మురుగు సెల్లార్లలోకి చేరుతోంది. ప్రధాన రహదారిపై తవ్వకాలు చేయడానికి అనుమతి లేని కారణంగా, ఈ సాంకేతికతతో సమస్యను పరిష్కరించనున్నట్లు వెల్లడించారు. త్వరలో మిగతా ప్రాంతాల్లోనూ అమలు చేయనున్నారు.

News October 7, 2024

HYDలో కోటికి చేరనున్న వాహనాల సంఖ్య!

image

HYDలో రాబోయే పదేళ్లలో వాహనాల సంఖ్య కోటి దాటనుందని నిపుణులు అంచనా వేశారు. కానీ.. ఆ స్థాయిలో రోడ్లు విస్తరణకు, నిర్మాణానికి నోచుకోక, ట్రాఫిక్ సమస్య పెరుగుతోంది. ట్రాఫిక్ సమస్య నివారణకు ‘ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ మేనేజ్మెంట్ కమిటీకి’ జీహెచ్ఎంసీ కమిషనర్ అమ్రపాలి నడుంబిగించారు. ట్రాఫిక్, ఐటీ విభాగాల అదనపు కమిషనర్లు ఈ కమిటీలు సభ్యులుగా ఉంటారని తెలిపారు.