News May 11, 2024
HYD: ఓటేసిన వారికి ఆఫర్ అంటూ ఫ్లెక్సీ

HYD కుత్బుల్లాపూర్ పరిధి సూరారంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని, పోలింగ్ శాతాన్ని పెంచాలని కోరుతూ సామాజిక కార్యకర్త రవీందర్ ముదిరాజ్ శనివారం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. మే 13న ఎన్నికల్లో ఓటు వేసిన వారు.. తమ షాప్‌కు వచ్చి వారి చేతికున్న సిరా గుర్తు, ఓటర్ ఐడీ, ఆధార్ కార్డు చూపిస్తే కూరగాయలు 10 శాతం, జిరాక్స్ 25 శాతం తక్కువ ధరకు ఇస్తానని బ్యానర్ ఏర్పాటు చేశారు.
Similar News
News February 19, 2025
HYD: మహా కుంభమేళాకు ప్రత్యేక రైళ్లు

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభ మేళా కోసం దక్షిణ మధ్య రైల్వే (SCR) ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. భక్తుల సౌకర్యార్థం ఈ రైళ్లను ప్రవేశపెట్టింది. సికింద్రాబాద్ నుంచి దానాపూర్, రక్సౌల్‌కు ప్రత్యేక రైళ్లు నడపనుంది. ఈ రైళ్లు ఫిబ్రవరి 20 నుంచి 28 వరకు అందుబాటులో ఉంటాయి. రైళ్ల రాకపోకల వివరాలు.. తేదీల కోసం పైన పేర్కొన్న పట్టికను చూడండి. ఈ రైళ్ల రాకపోకల సమాచారం కోసం SCR వెబ్‌సైట్ చూడొచ్చు.
News February 19, 2025
HYD:”17 మంది నిందితులకు జీవితఖైదు”

నల్గొండ జిల్లా SC, ST స్పెషల్ సెషన్స్ కోర్టు అడ్డగూడూర్ పరిధిలో 2017లో జరిగిన హత్య కేసులో 17 మంది నిందితులకు జీవిత ఖైదు శిక్ష విధించింది. పాత కక్షల కారణంగా అజీంపేట(V)కి చెందిన బట్ట లింగయ్యను దారుణంగా హత్య చేసిన కేసులో న్యాయస్థానం ఈ తీర్పును వెలువరించింది. రాచకొండ పోలీసులు వేగంగా విచారణ జరిపి, పక్కా సాక్ష్యాలను సమర్పించడంతో నిందితులకు కఠిన శిక్ష పడింది.
News February 19, 2025
HYD:హత్య కేసులో నిందితుడికి జీవిత ఖైదు

బీబీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 2016లో చోటుచేసుకున్న హత్య కేసులో నిందితుడు శెట్టి శ్రీశైలం (53)కు భువనగిరి ADJ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించింది. కుటుంబ విచ్చిన్నానికి కారణమయ్యాడని కక్ష పెంచుకుని నిందితుడు హత్యకు పాల్పడ్డాడని నిర్ధారణకు వచ్చారు. SC No. 185/2018 ప్రకారం, కోర్టు 302 IPC కింద జీవిత ఖైదుతో పాటు రూ.20,000 జరిమానా విధించింది. ఈ కేసులో అదనపు పిపి. దామోదర్ రెడ్డి వాదనలు వినిపించారు.