News October 24, 2024
HYD: ఓపెన్ డిగ్రీ చేయాలనుకుంటున్నారా..!

హైదరాబాద్‌లోని డా.బీ.ఆర్.అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించిన దూరవిద్య విధానంలో యూజీ, పీజీ, డిప్లొమా, సర్టిఫికేట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు చేసుకోవాలని సంబంధిత అధికారులు తెలిపారు. యూజీ కోర్సులు బీఏ, బీకం, పీజీ కోర్సులు ఎంఏ, ఎమ్మెస్సీ, డిప్లొమా కోర్సులకు అర్హత కలిగిన వారు ఈ నెల 30 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. వెబ్సైట్: www.braouonline.in
Similar News
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: 1PM UPDATE.. 31.94% పోలింగ్ నమోదు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు 31.94% పోలింగ్ నమోదు అయ్యింది. సాయంత్రం 6 గంటలకు క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసేందుకు అవకాశం కల్పించనున్నారు. 2023 సాధారణ ఎన్నికల కంటే ఈసారి ఓటింగ్ శాతం అధికంగా నమోదు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇంకా ఓటు వేయని వారు ఉంటే మీ అమూల్యమైన హక్కును వినియోగించుకోండి.
News November 11, 2025
జూబ్లీహిల్స్ బైపోల్: ‘నేను ఓటు వేశాను.. మరి మీరు?’

జూబ్లీహిల్స్ బైపోల్లో ఓటు వేసేందుకు యువత ఆసక్తి చూపిస్తోంది. యూసుఫ్‌గూడలోని పలు పోలింగ్ బూత్‌లలో యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటేసిన అనంతరం బయటకు వచ్చి ఫొటోలు దిగుతూ ఆనందం వ్యక్తం చేశారు. ‘నేను ఓటు వేశాను.. మరి మీరు’ అంటూ స్నేహితులకు సందేశం పంపుతున్నారు. యువత.. మీరూ కొంచెం ఆలోచించండి. ఓటు వేసి SMలో ఒక పోస్ట్ పెట్టండి. ఇంకా ఓటు వేయనివారిని పోలింగ్‌కు తీసుకెళ్లండి.
News November 11, 2025
HYD: మొయినుద్దీన్ కదలికలపై ATS ఆరా

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్ మొయినుద్దీన్ సయ్యద్ NTT ద్వారా ISKP నెట్ వర్క్ విస్తరించడానికి ప్రయత్నించాడు. దీనికోసం హైదరాబాద్‌తోపాటు వివిధ నగరాలు, రాష్ట్రాల్లో ఉన్న వారితో సంప్రదింపులు జరిపాడు. వీరిలో ఎందరు ఇతడి ద్వారా ఉగ్రబాట పట్టారనేది ATS ఆరా తీస్తోంది. గడచిన కొన్నేళ్లుగా అతడి కదలికలు, సంప్రదింపులు జరిపిన వ్యక్తులు తదితరాలను ఆరా తీస్తోంది.


