News August 20, 2024
HYD: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్

సార్వత్రిక విద్యాపీఠం(ఓపెన్ స్కూల్) విధానంతో వయోజనులు, గృహిణులు కనీస విద్యార్హతలైన పదో తరగతి, ఇంటర్ సాధించేందుకు ఈ విధానం ఎంతో సహకరిస్తుంది. ప్రస్తుతం 2024-25 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు అంతర్జాల కేంద్రాల ద్వారా, మీ సేవా కేంద్రాల ద్వారా ప్రవేశాలను నమోదు చేసుకోవచ్చు. సెప్టెంబరు 10వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
Similar News
News November 12, 2025
చంచల్గూడ జైలులో ఖైదీల మధ్య ఘర్షణ

HYDలోని చంచల్గూడ జైలులో జాబ్రి, దస్తగిరి అనే రౌడీషీటర్ల మధ్య ఘర్షణ జరిగింది. ఈ దాడిలో ఇద్దరికీ గాయాలవ్వగా జాబ్రీని సికింద్రాబాద్ గాంధీకి, దస్తగిరిని ఉస్మానియా ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ఓ కేసులో రిమాండ్ ఖైదీగా వచ్చిన జాబ్రిను చూడగానే దస్తగిరి దాడికి దిగినట్లుగా తెలుస్తోంది. వీరి గొడవతో ములాఖత్ రూమ్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. వారిద్దరి మధ్య పాత గొడవలు ఉన్నట్లు సమాచారం.
News November 12, 2025
HYD: రాష్ట్రంలో కాంగ్రెస్కి ఢోకా లేదు: TPCC

రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి ఢోకా లేదని టీపీసీసీ చీఫ్ మహేశ్ అన్నారు. సీఎంగా రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎంగా భట్టి విక్రమార్క, టీపీసీసీగా తామే ఉంటామని చిట్చాట్లో పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మంచి మెజారిటీతో గెలుస్తామని, జూబ్లీహిల్స్ ఫలితం తర్వాత లోకల్ బాడీ ఎన్నికలపై స్టడీ చేస్తామన్నారు. కాంగ్రెస్ మరో 10ఏళ్లు అధికారంలో ఉంటుందని, ఏ ఎలక్షన్ వచ్చినా గెలిచేది కాంగ్రెస్ అన్నారు.
News November 12, 2025
HYD: గాంధీ విగ్రహాల సేకరణ ప్రచార రథం ప్రారంభం

గాంధీభవన్లో గాంధీ జ్ఞాన్ ప్రతిష్ఠాపన స్వర్ణోత్సవాల సందర్భంగా చేపట్టిన ‘ఒక అడుగు- లక్ష గాంధీజీ విగ్రహాలు’ కార్యక్రమానికి ప్రచార రథాన్ని TPCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంతో తెలంగాణ ప్రభుత్వం ప్రపంచంలోనే ఎత్తైన గాంధీజీ విగ్రహం ప్రతిష్ఠాపనకు పూనుకోవడంపై హర్షం వ్యక్తం చేశారు.


