News April 29, 2024
HYD: ఓయూలో ఆందోళన.. కదిలిన అధికారులు

OUలో తాగునీటి సరఫరా సక్రమంగా లేదంటూ జరుగుతున్న ప్రచారంపై <<13137079>>DigitalMediaTS<<>> వివరణ ఇచ్చింది. ‘జలమండలి MD సుదర్శన్ రెడ్డి VC రవీందర్తో ఫోన్లో మాట్లాడారు. HMWSSB ఉన్నతాధికారులు సంబంధిత AEతో కలిసి OUను సందర్శించారు. ఒప్పందం కంటే ఎక్కువే నీరు సరఫరా చేస్తున్నట్లు నిర్ధారించారు. అవసరమైతే OU అధికారుల అభ్యర్థన మేరకు మరింత నీరు సరఫరా చేసేందుకు జలమండలి సిద్ధంగా ఉంది’అని స్పష్టం చేసింది.
Similar News
News January 7, 2026
యాదాద్రి వద్దు.. చార్మినార్లో కలపాలి!

TGలో మరో ఉద్యమం ఉద్ధృతమవుతోంది. పోలీస్ నియామకాలలో జోన్ల వివాదం అగ్గి రాజేసుకుంటోంది. రాచకొండను యాదాద్రి జోన్లో ఉంచడం సిటీ అభ్యర్థులకు తీవ్ర అన్యాయమని మండిపడుతున్నారు. సూర్యాపేట, NLG, యాదాద్రి జిల్లాల వల్ల కట్ఆఫ్ పెరిగి మేడ్చల్, RR అర్బన్ అభ్యర్థులు ఉద్యోగాలు కోల్పోతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్కాజిగిరి కొత్త కమిషనరేట్ కావడంతో, దీన్ని చార్మినార్ జోన్లో కలపాలని డిమాండ్ చేస్తున్నారు.
News January 7, 2026
HYD: ఫతేమైదాన్ వద్ద ఈ గుట్ట గురించి తెలుసా?

నగరం అపూర్వ కట్టడాలు, సంపదకు నెలవు. ఇక్కడి కట్టడాలపై చరిత్రకారులు రాసిన పుస్తకాలు అనేకం. పెద్దగా ప్యాచుర్యంలేని ఫతేమైదాన్ సమీపంలో ‘నౌబత్ పహాడ్’ గురించి తెలుసా? ఈ పేరు వెనుక ఆసక్తికరమైన చరిత్ర ఉంది. ‘నౌబత్’ అంటే డోలు, ‘పహాడ్’ అంటే గుట్ట. ప్రజలకు ఫర్మానాలు వినిపించడానికి ఈ కొండపైనే నగారాలు మోగించేవారు. డోలు కొడుతూ ఆజ్ఞలను వినిపించేవారు. అలా ఈ ప్రాంతానికి నౌబత్ పహాడ్ అనే పేరు వచ్చింది.
News January 7, 2026
354కి చేరిన AQ.. HYDలో జర భద్రం

HYDలో ఎయిర్ క్వాలిటీ మరొకసారి తారస్థాయికి చేరింది. పొగమంచు, చెత్తాచెదారం, వాహనాల నుంచి వెలువడే పొగతో కాలుష్యం పెరుగుతూ వస్తోంది. డబుల్ డిజిట్లో ఉండాల్సిన ఎయిర్క్వాలిటీ బుధవారం బడంగ్పేట్లో తెల్లవారుజామున 354కి చేరింది. శ్వాసకోశ వ్యాధులు, సైనసైటీస్, డస్ట్ అలర్జీ ఉన్నవారితో పాటు సామాన్యులు మాస్కులు ధరించడం మేలని డాక్టర్లు సూచిస్తున్నారు. గతవారం రోజులుగా పెరుగుతూ, తగ్గుతూ ఇవాళ భారీగా పెరిగింది.


