News March 20, 2025
HYD: ఓయూలో తగ్గేదే లే!

ఓయూలో మళ్లీ ఆందోళనలు మొదలయ్యాయి. నిరసనలు నిషేధం అన్న సర్క్యూలర్ అగ్గిరాజేసింది. ఉమ్మడి రాష్ట్రంలో లేని ఆంక్షలు ఇప్పుడు పెట్టడం ఏంటని విద్యార్థి సంఘాలు భగ్గుమన్నాయి. వామపక్షాలు నేడు బంద్కు పిలుపునివ్వడంతో విద్యార్థులు మళ్లీ రోడ్డెక్కారు. ఇది నిబంధన కాదు నిర్బంధం అంటూ గొంతెత్తారు. వెనక్కి తగ్గేదేలే అంటున్నారు. ఇక అధికారులూ బెట్టు వీడకపోవడంతో పోలీసులు రంగప్రవేశం తప్పడం లేదు. దీనిపై మీ కామెంట్?
Similar News
News March 31, 2025
HYD: ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు

ఆస్తి పన్ను వసూళ్లలో జీహెచ్ఎంసీ రికార్డు సాధించింది. గ్రేటర్ పరిధిలో పన్ను వసూళ్లు నేటితో రూ.2 వేల కోట్లు దాటిపోయాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గాను రూ.2012.36 కోట్లు వసూలైనట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. జీహెచ్ఎంసీ చరిత్రలోనే తొలిసారిగా ఆస్తిపన్ను వసూళ్లు రూ.2వేల కోట్లు దాటినట్లు అధికారులు పేర్కొన్నారు.
News March 31, 2025
రంజాన్ వేళ.. HYDలో వీటికి ఫుల్ DEMAND

HYD నగరంలో రంజాన్ పండుగ వేళ బిర్యానీ, క్యాబ్స్, బుకింగ్ ఆటోలకు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. పండగ కావడంతో రెడ్ హిల్స్ లాంటి అనేక ప్రాంతాల్లో ముస్లిం ఆటో డ్రైవర్లు సెలవు తీసుకున్నారు. మరోవైపు పండగ వేళ నగరంలో రద్దీగా ఉండడంతో సాధారణ రోజులతో పోలిస్తే బుకింగ్ ఆటోలకు 20 నుంచి 30 శాతం అధికంగా చార్జీలు పడుతున్నట్లు ప్రయాణికులు తెలిపారు. ఆన్లైన్ ఆర్డర్లతో రెస్టారెంట్లు, హోటల్స్ కిక్కిరిస్తున్నాయి.
News March 31, 2025
HYD: ఎన్నికల్లో BJP 100% పోటీ: బండి సంజయ్

జీహెచ్ఎంసీ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్ కలిసి పనిచేస్తున్నాయని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ ఆరోపించారు. ఈ మూడు పార్టీలు ఓటింగ్లో కుట్ర పన్నుతున్నాయని తెలిపారు. మజ్లిస్ అభ్యర్థిని గెలిపించేందుకు కాంగ్రెస్, బీఆర్ఎస్ పోటీ చేయడం లేదని, తెలంగాణ ప్రజలు ఈ రాజకీయ సమీకరణాన్ని గమనించాలని సూచించారు. ఈ ఎన్నికల్లో బీజేపీ 100% పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.