News March 11, 2025
HYD: ఓయూలో భోజనంలో బ్లేడ్

OUలో విద్యార్థులు కంగుతినే ఘటన వెలుగుచూసింది. మంగళవారం భోజనంలో రేజర్ బ్లేడు కనిపించడం తీవ్ర కలకలం రేపింది. న్యూ గోదావరి హాస్టల్ మెస్‌లో రాత్రి విద్యార్థులు డిన్నర్ చేస్తున్నారు. ఆహారంలో బ్లేడ్ కనిపించడంతో విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎవరి నోట్లోకైనా వెళ్లి ఉంటే వారి పరిస్థితి ఏంటని వాపోయారు. నాణ్యమైన ఆహారం అందించాలంటూ ఎన్నిసార్లు ఆందోళన చేసినా ఫలితం లేదని మండిపడ్డారు.
Similar News
News March 12, 2025
సిద్దిపేట: దివ్యాంగులు ధైర్యంగా ఉండాలి: డీఈఓ

దివ్యాంగులు నిరుత్సాహపడకుండా ధైర్యంగా మానసిక స్తైర్యంతో ఉండాలని సిద్దిపేట జిల్లా విద్యాశాఖ అధికారి ఎల్లంకి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బుధవారం సిద్దిపేట టీటీసీ భవన్లో భారత కృత్రిమ అవయవాల నిర్మాణ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని 57 మంది దివ్యాంగులకు ఉచితంగా ఉపకరణాలు పంపిణీ చేశారు. డీఈవో మాట్లాడుతూ.. దివ్యాంగులు ఉపకరణాలు ఉపయోగించి మానసికంగా అభివృద్ధి చెందాలని సూచించారు.
News March 12, 2025
పోసానిపై బాపట్లలో కేసు నమోదు

సినీ నటుడు, వైసీపీ నేత పోసాని కృష్ణ మురళికి మరో షాక్ తగిలింది. ఆయనపై బాపట్ల పోలీస్ స్టేషన్‌లో బుధవారం కొత్తగా కేసు నమోదైంది. తిరుమల తిరుపతి దేవస్థాన చైర్మన్ బీఆర్ నాయుడుపై పోసాని అసభ్యకర వ్యాఖ్యలు చేశారని టీడీపీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు బాపట్ల పీఎస్‌లో కేసు నమోదు చేశారు.
News March 12, 2025
క్రికెటర్స్ కమ్ రెస్టారెంట్ ఓనర్స్!

టీమ్ఇండియా తరఫున ఆడిన కొందరు భారత క్రికెటర్లకు సొంతంగా రెస్టారెంట్ బిజినెస్‌లు ఉన్నాయనే విషయం మీకు తెలుసా? స్పోర్ట్స్ థీమ్‌తో కపిల్ దేవ్ ‘ఎలెవన్స్’ రెస్టారెంట్ స్థాపించారు. విరాట్ కోహ్లీ (One8 Commune), రవీంద్ర జడేజా (జడ్డూస్ ఫుడ్ ఫీల్డ్), సురేశ్ రైనా (రైనా), జహీర్ ఖాన్ (డైన్ ఫైన్), శిఖర్ దావన్ (ది ఫ్లైయింగ్ క్యాచ్), స్మృతి మందాన మహారాష్ట్రలోని సంగ్లీలో SM18 కేఫ్ నిర్వహిస్తున్నారు.