News August 29, 2024

HYD: ఓయూలో రూ.23 లక్షల ప్యాకేజీతో ప్లేస్‌మెంట్‌

image

ఓయూలో ఇటీవల జరిగిన క్యాంపస్ ప్లేస్‌మెంట్‌లో ఎంబీఏ, టెక్నాలజీ మేనేజ్‌మెంట్ విద్యార్థులు 17 మందికి HDFC బ్యాంక్ కొలువులు ఇచ్చింది. రూ.8 లక్షల నుంచి రూ.23 లక్షల మధ్య వార్షిక వేతనంతో ఈ నియామకాలు జరిగాయి. MBA కళాశాలలో నాలుగో సెమిస్టర్ చదువుతున్న 120 మంది విద్యార్థుల్లో 109 మందికి వేర్వేరు కంపెనీలు నియామక పత్రాలు అందించనున్నాయి.

Similar News

News February 19, 2025

రహమత్‌నగర్ ఆస్పత్రిలో కలెక్టర్ అనుదీప్

image

రహ్మత్‌నగర్ డివిజన్ శ్రీ రామ్ నగర్‌లోని గవర్నమెంట్ ఆస్పత్రిని హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురిషెట్టి పరిశీలించారు. సమస్యలను అడిగి తెలుసుకొని వెంటనే పరిష్కరిస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. గైనకాలజిస్ట్ డాక్టర్ లేకపోవడం, మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆయన దృష్టికి కార్పొరేటర్ సీఎన్ రెడ్డి తీసుకెళ్లారు. ఎస్పీఆర్ హిల్స్‌లోని క్వారీ ల్యాండ్, వాటర్ రిజర్వాయర్, స్టడీ సర్కిల్‌ని కూడా కలెక్టర్ సందర్శించారు.

News February 19, 2025

HYD: కేసీఆర్ అధ్యక్షతన పార్టీ విస్తృత స్థాయి సమావేశం

image

బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తో పాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గం, జిల్లా పార్టీ అధ్యక్షుడు, ప్రస్తుత, మాజీ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. 25 ఏళ్ల బీఆర్ఎస్ సిల్వర్ జూబ్లీ వేడుకల నిర్వహణతో పాటు, పార్టీ సభ్యత్వ నమోదుపై చర్చించనున్నారు.

News February 19, 2025

HYD: గుండెపోటుతో మరో లాయర్ మృతి..!

image

HYDలో నేడు మరో లాయర్ గుండెపోటుతో మృతి చెందారు. తార్నాకకు చెందిన లాయర్ వెంకటరమణ మారేడ్‌పల్లిలోని ఇండియన్ బ్యాంక్‌లో చలానా కట్టేందుకు వెళ్లి ఒక్కసారిగా కుప్పకూలారని స్థానికులు తెలిపారు. హుటాహటిన ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. నిన్న హైకోర్టులో వాదనలు వినిపిస్తూనే లాయర్ వేణుగోపాల్ రావు మరణించిన సంగతి తెలిసిందే. వరుస గుండెపోటు మరణాలు HYDలో భయాందోళనలు కలిగిస్తున్నాయి.

error: Content is protected !!