News February 14, 2025

HYD: ఓయూ ఓపెన్ డిగ్రీ ప్రవేశ ప్రకటన

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ డిగ్రీ కోర్సుల రెండో విడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రవేశాలు UGC-దూరవిద్య బ్యూరో (DEB) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. అభ్యర్థులు www.osmania.ac.in లేదా oucde.net వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను పొందవచ్చు. దరఖాస్తుకు చివరి తేది 31 మార్చి 2025.

Similar News

News December 9, 2025

చిత్తూరు నూతన DEOగా రాజేంద్ర ప్రసాద్

image

చిత్తూరు జిల్లా నూతన డీఈవోగా రాజేంద్ర ప్రసాద్‌ నియమితులయ్యారు. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన ప్రస్తుతం బుక్కపట్నం డైట్ కాలేజీ ప్రిన్సిప‌ల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. మరో వారంలో ఆయన డీఈవోగా బాధ్యతలు నిర్వహిస్తారని సమాచారం. ప్రస్తుత చిత్తూరు డీఈవో వరలక్ష్మిని కార్వేటినగరం డైట్ కాలేజీకి బదిలీ చేయనున్నారు.

News December 9, 2025

నెల్లూరు: కాలువలో డెడ్ బాడీ కలకలం

image

ముత్తుకూరు మండలం బ్రహ్మదేవం పరిధిలోని బుడ్డి డ్రైన్ సమీపంలో ముత్తుకూరు కాలువలో గుర్తుతెలియని మృతదేహం మంగళవారం సాయంత్రం లభ్యమైంది. పంటకాలువలో కొట్టుకువచ్చిన మృతదేహాన్ని స్థానికులు గుర్తించి పోలీసు, రెవెన్యూ అధికారులకు సమాచారం అందించారు. మూడు రోజుల క్రితం చనిపోయిన 45 సంవత్సరాల పురుషుడు మృతదేహంగా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News December 9, 2025

మొదటి విడత ప్రచారానికి తెర

image

TG: పంచాయతీ ఎన్నికల్లో కీలక ఘట్టానికి తెరపడింది. తొలి విడత ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈనెల 11న ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభమవుతుంది. తర్వాత ఫలితాలు వెలువడతాయి. మొదటి విడతలో 4,235 గ్రామాల్లో పోలింగ్ జరగనుంది. 56,19,430 మంది ఓటు వేయనున్నారు. వీరి కోసం 37,562 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.