News February 14, 2025

HYD: ఓయూ ఓపెన్ డిగ్రీ ప్రవేశ ప్రకటన

image

ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రామ్‌రెడ్డి డిస్టెన్స్ ఎడ్యుకేషన్ సెంటర్ ఓపెన్ డిగ్రీ కోర్సుల రెండో విడత ప్రవేశాలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రవేశాలు UGC-దూరవిద్య బ్యూరో (DEB) మార్గదర్శకాలకు అనుగుణంగా ఉంటాయి. అభ్యర్థులు www.osmania.ac.in లేదా oucde.net వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తి వివరాలను పొందవచ్చు. దరఖాస్తుకు చివరి తేది 31 మార్చి 2025.

Similar News

News November 2, 2025

HYD: ఇక మొబైల్‌లోనే సులువుగా ఆధార్ అప్‌డేట్

image

ఆధార్ సేవలను యూఐడీఏఐ మరింత సులువు చేసిందని HYDలో అధికారులు తెలిపారు. ఇక నుంచి మొబైల్‌లోనే ఎడిట్ చేసుకునే అవకాశం కల్పించింది. చిరునామా అప్‌డేట్, డాక్యుమెంట్ల అప్‌లోడ్, మొబైల్ నంబర్ అప్‌డేట్ వంటివి మొబైల్‌లోనే చేసుకోవచ్చు. ఈ సేవలు పొందాలంటే యూఐడీఏఐ పోర్టల్ లేదా మై ఆధార్ యాప్ ద్వారా ఆన్‌లైన్ అప్‌డేట్ చేయవచ్చు. కానీ బయోమెట్రిక్, ఐరిస్ వంటి సేవల కోసం ఆధార్ సెంటర్‌కు వెళ్లాల్సి ఉంటుంది. SHARE IT

News November 2, 2025

HYD: ప్రచారంలో దోశ వేసిన మంత్రి

image

జూబ్లీహిల్స్ పరిధి రహమత్‌నగర్ డివిజన్‌లో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈరోజు ఉపఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. శ్రీరామ్ నగర్, సంధ్యా నగర్, కార్మిక నగర్, వినాయకనగర్, ఎస్‌పీఆర్ హిల్స్‌లో పాదయాత్ర నిర్వహించి, ఇంటింటికీ తిరుగుతూ కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌ను గెలిపించాలని కోరారు. అనంతరం ఓ హోటల్‌లో మంత్రి దోశ వేసి సందడి చేశారు. కాంగ్రెస్‌ను గెలిపించి, ప్రజాపాలనకు మద్దతు తెలపాలన్నారు.

News November 2, 2025

HYD: తెలంగాణ జాగృతి టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీ ఏర్పాటు

image

తెలంగాణ జాగృతి బలోపేతంపై కవిత ఫోకస్ పెట్టారు. తాజాగా టీచర్స్ ఫెడరేషన్ నూతన కమిటీని జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు. ఫెడరేషన్ నూతన కమిటీ అధ్యక్షుడిగా మోరం వీరభద్రరావు, ఉపాధ్యక్షుడిగా బుర్ర రమేశ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా జాడి శ్రీనివాస్, కోశాధికారిగా ఘనపురం దేవేందర్‌ను నియమించినట్లు ఆమె తెలిపారు. వెంటనే వీరి నియామకాలు అమల్లోకి వస్తాయని కవిత పేర్కొన్నారు.