News March 16, 2025
HYD: ఓయూ క్యాంపస్లో ఇవి బంద్!

ఓయూలో ఆందోళనలు, ప్రదర్శనలపై నిషేధం విధిస్తూ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ నరేశ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. దీనిని అతిక్రమించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ నిర్ణయంపై విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా మండిపడుతున్నాయి. శాంతియుతంగా నిరసన తెలుపడం ప్రజాస్వామ్య హక్కు అని, దానిని అణిచివేయాలని చూస్తే పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరిస్తున్నాయి.
Similar News
News December 25, 2025
గజ గజ.. బయటికి వెళ్తే స్వెటర్లు మరవద్దు!

తెలుగు రాష్ట్రాల్లో రానున్న 2 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని IMD తెలిపింది. దీంతో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చిన్నారులు, వృద్ధులను బయటికి తీసుకెళ్లొద్దని సూచిస్తున్నారు. తప్పనిసరి అయితే స్వెటర్లు ధరింపజేయాలని చెబుతున్నారు. చెవులు, అరచేతులు, పాదాలు వెచ్చగా ఉండేలా చూడాలంటున్నారు.
News December 25, 2025
నకిరేకల్లో తప్పిపోయిన సూర్యాపేట బాలిక.. చివరికి..!

సూర్యాపేటకు చెందిన ఓ బాలిక ఆమె తల్లితో పాటు సూర్యాపేట వెళ్తున్న క్రమంలో తల్లికి తెలియకుండా నకిరేకల్లో ప్రధాన కూడలి వద్ద దిగింది. చూసుకోకుండా ఆమె ఉన్న వాహనం అక్కడి నుంచి వెళ్లిపోయింది. పాప ఏడ్చుకుంటూ అక్కడే తిరుగుతుండగా అక్కడ ఉన్నవారు గమనించి నకిరేకల్ పోలీస్ స్టేషన్కి తీసుకురావడంతో SI వీరబాబు డీటెయిల్స్ కనుక్కొని సంబంధించిన వారికి తెలియపరచి, తల్లిదండ్రులకు అప్పగించారు.
News December 25, 2025
వేగంగా పనులు చేయండి: అన్నమయ్య కలెక్టర్

రహదారుల పనులు వేగవంతంగా పూర్తి చేసి ప్రజలకు ప్రయాణ ఖర్చు తగ్గేలా చూడాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లో వివిధ ఇంజినీరింగ్ శాఖల పనుల పురోగతిపై సమీక్షించారు. గ్రామీణ రహదారులను మండల, జిల్లా రహదారులకు అనుసంధానం చేయాలన్నారు. జలజీవన్ మిషన్, వాటర్ గ్రిడ్, R&B, నీటిపారుదల, జాతీయ రహదారుల పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులకు సూచించారు.


