News October 26, 2024

HYD: ఓయూ దూర విద్యలో దరఖాస్తులకు ఆహ్వానం

image

దూర విద్య ద్వారా ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఉమ్మడి ప్రవేశ పరీక్ష కోసం అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని ఉస్మానియా యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్‌ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌ విధానంలో నవంబర్‌ 5వ తేదీ వరకు, రూ.500 ఆలస్య రుసుంతో 8వ తేదీ వరకూ దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్‌ 9న జరగనుందని తెలిపారు. వెబ్‌సైట్‌: www.ouadmissions.com

Similar News

News November 8, 2024

HYD: సర్వేను విజయవంతంగా పూర్తి చేయాలి: సీఎస్

image

సమగ్ర కుటుంబ సర్వేను విజయవంతంగా పూర్తి చేసేందుకు చిత్తశుద్ధితో కృషి చేయాలని సీఎస్ శాంతి కుమారి అధికారులను ఆదేశించారు. సర్వే నిర్వహణపై సీఎస్ ప్రత్యేకాధికారులతో HYD సచివాలయం నుంచి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా ఆమె సమీక్షించారు. శాంతికుమారి మాట్లాడుతూ.. ఈ సర్వేకు సంబంధించి ఇంటింటి వివరాలను సేకరించి స్టిక్కరింగ్ చేసే ప్రక్రియ శుక్రవారంతో పూర్తవుతుందని, ఈనెల 9 నుంచి అసలు సర్వే మొదలవుతుందని అన్నారు.

News November 8, 2024

HYD: యాక్సిడెంట్.. ప్రిన్సిపల్ మృతి

image

యాక్సిడెంట్‌‌లో HYD వాసి మృతి చెందారు. మలక్‌పేట అజంతా కాలనీకి చెందిన అర్చన సంగారెడ్డి జిల్లా మునిపల్లి మం. బుదేరా సాంఘిక సంక్షేమ శాఖ గురుకుల కళాశాల ప్రిన్సిపల్‌గా పని చేస్తున్నారు. బుధవారం రోడ్డు ప్రమాదానికి గురైన అర్చనకు గుండెపోటు వచ్చింది. హుటాహుటిన లింగంపల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ గురువారం చనిపోయినట్లు కుటుంబీకులు తెలిపారు. భర్త ప్రవీణ్ ఫిర్యాదుతో కేసు నమోదైంది.

News November 8, 2024

HYD: RRR సమాంతరంగా రింగ్ రైల్ సర్వే షురూ..!

image

RRR రహదారికి సమాంతరంగా రింగ్ రైల్ నిర్మాణానికి అడుగు ముందుకు పడింది. ఇందులో భాగంగా ఆర్బీ అసోసియేషన్ ఏజెన్సీ ప్రతినిధులు సర్వే చేస్తున్నట్లు తెలిపారు. సర్వేకు కోడంగల్ ప్రాంతాన్ని ఎంచుకున్నారు. సుమారు 564 కిలోమీటర్ల మేర ఈ ప్రాజెక్టు రూపు దిద్దుకొనుందని, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, గజ్వేల్, భువనగిరి, యాదాద్రి, చిట్యాల నారాయణపూర్, షాద్‌నగర్, షాబాద్‌ను కలుపుతూ.. ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు.