News March 20, 2025
HYD: ఓయూ బంద్‌కు పిలుపు

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్‌కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.
Similar News
News March 28, 2025
కంచరపాలెంలో దారుణం.. ఒకరు మృతి

విశాఖలో దారుణం చోటుచేసుకుంది. ఎస్ఆర్ఆర్ నగర్‌కు చెందిన పి.హనుమంతురావు(60) మృతదేహం కలకలం రేపింది. చెట్టుకు నగ్నంగా కట్టేసి కొట్టడంతో అతను చనిపోయినట్లు సమాచారం. స్థానికులు చెట్టుకు కట్టేసి ఉన్న అతని మృతదేహాన్ని కిందకు దించి వస్త్రాలు కప్పారు. వారి సమాచారం మేరకు కంచరపాలెం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతికి గల కారణాలపై ఆరా తీస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News March 28, 2025
జగిత్యాల: మెరుగైన విద్యుత్ అందించడానికి లైన్లలో కెపాసిటర్ల బిగింపు : SE

జగిత్యాల సర్కిల్ పరిధిలో విద్యుత్ వినియోగదారులకు మెరుగైన, నాణ్యమైన సేవలు అందించడానికి విద్యుత్ లైన్లలో కెపాసిటర్లను అమర్చుతున్నామని జగిత్యాల జిల్లా సూపరింటెండింగ్ ఇంజనీర్ సాలియానాయక్ గురువారం తెలిపారు. వోల్టేజ్ లో విద్యుత్ హెచ్చు తగ్గులు లేకుండా కెపాసిటర్లు ఉపయోగపడతాయని అన్నారు. ఇప్పటివరకు 41 కెపాసిటర్లు బిగించామని తెలిపారు. వీటివల్ల ట్రాన్స్ఫార్మర్స్పై లోడ్ తగ్గి మోటార్లు కాలిపోకుండా ఉంటాయి
News March 28, 2025
రూ.14 లక్షలు పలికిన ఒంగోలు గిత్త

నంద్యాల జిల్లా ప్యాపిలి మండలంలోని డి.రంగాపురం గ్రామానికి చెందిన రామకృష్ణారెడ్డి ఒంగోలు జాతి గిత్తను రూ.14 లక్షలకు విక్రయించారు. ప్రకాశం జిల్లా ముదిరముప్పాల గ్రామానికి చెందిన శేషాద్రి చౌదరి గిత్తను కొనుగోలు చేశారు. ఐదు సంవత్సరాల వయసు కలిగిన ఈ ఒంగోలు గిత్త ఎడ్ల పోటీల్లో సత్తా చాటుతోంది. ఇది వరకు పలు పోటీల్లో పాల్గొని ప్రథమ, ద్వితీయ స్థానాల్లో బహుమతులను గెలుపొందింది.