News March 20, 2025

HYD: ఓయూ బంద్‌కు పిలుపు

image

ఓయూలో ఆందోళనలు, నిరసన ప్రదర్శనలు నిషేధం అని అధికారులు విడుదల చేసిన సర్క్యూలర్‌పై వ్యతిరేకత పెరుగుతోంది. ఇటీవల ABVP బంద్‌కు పిలుపునివ్వగా ఎక్కడికక్కడ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. నేడు SFI, AISF, PDSU, PDSU(V)AIDSO, PSU సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. ఓయూ విద్యార్థుల గొంతులు నొక్కే అప్రజాస్వామిక సర్క్యూలర్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి.

Similar News

News April 19, 2025

వివాహేతర సంబంధాన్ని నేరంగా చూడకూడదు: హైకోర్టు

image

వివాహేతర సంబంధం నేరమేమీ కాదని, అది నైతికతకు సంబంధించిన అంశమని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. మహాభారత కాలంలోలాగా భార్యను భర్త ఆస్తిలాగా చూడకూడదని స్పష్టం చేసింది. కాగా తన భార్య మరో వ్యక్తితో హోటల్‌లో శారీరకంగా దగ్గరైందని, వారిని శిక్షించాలని భర్త మెజిస్ట్రేట్ కోర్టుకు వెళ్లారు. దీంతో ఆ కోర్టు ప్రియుడికి నోటీసులు పంపింది. దీనిపై ప్రియుడు హైకోర్టుకు వెళ్లగా అతడికి అనుకూలంగా తీర్పునిచ్చింది.

News April 19, 2025

బీచ్ ఫెస్టివల్‌లో తాబేళ్లు వదిలిన రామ్మోహన్ నాయుడు

image

సోంపేట మండలం బారువ సముద్రపు ఒడ్డున బీచ్ ఫెస్టివల్ జరుగుతోంది. ఇందులో పాల్గొన్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తాబేలు పిల్లలను సముద్రంలో వదిలి పెట్టారు. ఫెస్ట్‌లో ఇసుకతో ఏర్పాటు చేసిన సైతక శిల్పం ఆకర్షణగా నిలిచింది. చుట్టు పక్క ప్రాంతాల వారు హాజరై ఆహ్లాదంగా గడుపుతున్నారు.

News April 19, 2025

NGKL: ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించిన MLA రాజేశ్ రెడ్డి

image

కాంగ్రెస్ పార్టీ నాగర్‌కర్నూల్ జిల్లా అధ్యక్షుడు, అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ కొన్ని రోజులుగా గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకుని ని విశ్రాంతి తీసుకుంటున్నాడు. శుక్రవారం ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి, ఎమ్మెల్సీ కూచకుళ్ల దామోదర్ రెడ్డితో కలిసి ఎమ్మెల్యే వంశీకృష్ణను పరామర్శించారు. అనంతరం మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వంశీకృష్ణ త్వరగా కోలుకొని ప్రజా జీవితంలోకి రావాలని ఆకాక్షించారు. నాయకులు పాల్గొన్నారు.

error: Content is protected !!