News November 26, 2024
HYD: ఓయూ వెళ్లేవారికి గుడ్‌న్యూస్

ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్లు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ భద్రతా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. అందరి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తార్నాక నుంచి శివం రోడ్ వైపుగా వెళ్లే రహదారిలో గేట్లను రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ గేట్లను రాత్రి ఎనిమిది గంటలకే మూసి వేస్తున్నారు. SHARE IT
Similar News
News October 15, 2025
HYD: బైక్ మీద వెళితే.. కుక్కలతో జాగ్రత్త!

టూ వీలర్‌పై వెళుతున్నపుడు వాహనం కంట్రోల్లో ఉండాలి. కుక్కలు కూడా సిటీలో వాహనచోదకులను ఇబ్బంది పెడుతున్నాయి. వీధి కుక్కలు అప్పుడప్పుడు రోడ్లపై సడన్‌గా బండికి అడ్డంగా వస్తుంటాయి. అప్పుడు బైక్ కంట్రోల్ కాకపోతే ప్రమాదాలకు గురవుతాం. ఒక్కోసారి ప్రాణాలు కూడా పోతాయి. ఇలా నిన్న తుకారాంగేట్ వద్ద ప్రాణాలు కోల్పోయింది అడ్డగుట్టకు చెందిన స్వప్న (42). భర్తతో కలిసి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. సో.. జాగ్రత్త.
News October 15, 2025
HYDలో నాసిరకం నర్సింగ్!

నాసిరకం సౌకర్యాలు.. అంతంత మాత్రమే బోధన.. ఇదీ నర్సింగ్ స్కూళ్ల నిర్వాహకుల నిర్వాకం. దీంతో పలువురు నర్సింగ్ స్కూళ్ల వ్యవహారంపై ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడంతో నర్సింగ్ కౌన్సిల్ తనిఖీలకు ప్రత్యేకంగా కమిటీలను నియమించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోని కళాశాలలపైనే ఎక్కువగా ఫిర్యాదులందాయి. కమిటీ స్కూళ్లల్లో తనిఖీలు నిర్వహించి సర్కారుకు నివేదిక ఇవ్వనుంది.
News October 15, 2025
రంజీ DAY-1: మ్యాచ్ HYD కంట్రోల్లో

రంజీ ఎలైట్ గ్రూప్ మ్యాచ్‌లో ఢిల్లితో HYD నెక్ట్స్ జెన్ స్టేడియంలో తలపడుతోంది. సొంతగడ్డపై టాస్ గెలిచిన తిలక్ సేన ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆద్యంతం మనోళ్లు బౌలింగ్‌తో ఎదురుదాడికి దిగారు. టీ బ్రేక్‌కి ఢిల్లీ 55 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. తొలుత ఢిల్లి తడబడినా కెప్టెన్ ఆయుష్ బదోనీ, సనత్ సంగ్వాన్ నిలబెట్టారు. HYD బౌలర్లలో మిలింద్ 2, బి.పున్నయ్య 1 వికెట్ పడగొట్టారు.