News November 26, 2024
HYD: ఓయూ వెళ్లేవారికి గుడ్‌న్యూస్
ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్లు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ భద్రతా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. అందరి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తార్నాక నుంచి శివం రోడ్ వైపుగా వెళ్లే రహదారిలో గేట్లను రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ గేట్లను రాత్రి ఎనిమిది గంటలకే మూసి వేస్తున్నారు. SHARE IT
Similar News
News December 2, 2024
HYD: సికింద్రాబాద్ పేరు ఎలా వచ్చిందో..తెలుసా.?
HYDలోని ప్రస్తుత సికింద్రాబాద్ ప్రాంతాన్ని అప్పట్లో లష్కర్ అని పిలిచేవారు. లష్కర్ అనే పదానికి అర్థం ఆర్మీ క్యాంప్. అప్పట్లో ఈ ప్రాంతంలో బ్రిటిష్ ఆర్మీ ఈ ప్రాంతంలో ఉండేవారు. మూడో నిజాం ‘సికిందర్ జా’ పేరు మీద 1806లో లష్కర్ ప్రాంతాన్ని ‘సికింద్రాబాద్’ ప్రాంతంగా పేరు మార్చారని చరిత్ర చెబుతోందని చరిత్రకారులు మురళి తెలిపారు.
News December 2, 2024
ఉప్పల్ నుంచి తొర్రూర్ వెళ్లేందుకు ఆర్టీసీ బస్
ఉప్పల్ నుంచి తొర్రూర్ వెళ్లేందుకు రింగ్ రోడ్డు వద్ద ఉదయం 4:19 గంటలకు మొదటి ఆర్టీసీ బస్ అందుబాటులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఎక్స్‌ప్రెస్ బస్సులో మహాలక్ష్మి పథకం కింద ఉచితంగా ప్రయాణించవచ్చు. ఇదే సమయంలో మరో సూపర్ లగ్జరీ బస్సు సైతం అందుబాటులో ఉన్నట్లుగా పేర్కొన్నారు. భువనగిరి, మోత్కూరు, తొర్రూరు వెళ్లే ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
News December 2, 2024
HYD: చుక్కా రామయ్య ఆరోగ్యంపై హరీశ్‌రావు ఆరా
నల్లకుంటలోని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ విద్యావేత్త ఐఐటీ చుక్కా రామయ్య ఆరోగ్యంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ఆరా తీశారు. అంబర్‌పేట MLA కాలేరు వెంకటేశ్‌తో కలిసి హరీశ్‌రావు ఆయనతో ముచ్చటించారు. గత నెల 20న చుక్కా రామయ్య పుట్టినరోజు రాలేకపోయానని తెలిపారు. దేశపతి శ్రీనివాస్, ఎర్రోళ్ల శ్రీనివాస్ తదితర నాయకులు ఉన్నారు.