News November 26, 2024

HYD: ఓయూ వెళ్లేవారికి గుడ్‌న్యూస్

image

ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ గేట్లు తెరిచి ఉంచే సమయాన్ని పెంచుతూ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు ఓయూ వీసీ ప్రొఫెసర్ ఎం. కుమార్ భద్రతా సిబ్బందికి ఉత్తర్వులు జారీ చేశారు. అందరి అభ్యర్థన మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇకపై తార్నాక నుంచి శివం రోడ్‌ వైపుగా వెళ్లే రహదారిలో గేట్లను రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచి ఉంచనున్నారు. ప్రస్తుతం ఈ గేట్లను రాత్రి ఎనిమిది గంటలకే మూసి వేస్తున్నారు. SHARE IT

Similar News

News December 4, 2024

HYD: తార్నాక IICTలో ఉద్యోగాలు

image

55% మార్కులతో 10TH, ఇంటర్, ITI చేసిన అభ్యర్థులకు శుభవార్త. HYD తార్నాకలోని CSIR-ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ(IICT) టెక్నీషియన్‌ విభాగంలో 29 ఖాళీలు ఉన్నాయి. భర్తీకి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. రూ. 500 చెల్లించి అప్లై చేసుకోవచ్చు. SC, ST, మహిళా అభ్యర్థులు ఫీజు లేకుండానే అప్లై చేసుకోవచ్చు. దరఖాస్తుకు చివరి తేదీ: 26-12-2024.
SHARE IT

News December 4, 2024

HYDలో ‘పుష్ప 2’ విడుదలయ్యే థియేటర్ల LIST!

image

సింగిల్ స్క్రీన్స్‌: సంధ్య 70, సంధ్య 35, సుదర్శన్ 35, దేవి 70-RTC X రోడ్స్, తారకరామ 70-కాచిగూడ, శాంతి 70-నారాయణగూడ, అంజలి 70, ప్రశాంత్ 70-సికింద్రాబాద్, శ్రీరమణ-అంబర్‌పేట, ఆరాధన AC-తార్నాక, గోకుల్ 70-ఎర్రగడ్డ, విజేత 70-బోరబండ, VLS శ్రీదేవి-చిలకలగూడ.
మల్టీప్లెక్స్‌: AMB, ప్రసాద్, PVR, Cinepolis, INOX, ASIAN, AAA, సినీప్లానెట్‌‌తో పాటు తదితర మల్టీ స్క్రీన్‌లలో సినిమా విడుదల చేస్తున్నారు.
SHARE IT

News December 4, 2024

HYD: రేపు డెక్కన్ ఎరీనాలో హోరాహోరీ మ్యాచ్

image

అజీజ్‌నగర్‌లో ఐ – లీగ్ (ఫుట్ బాల్) పోటీలు జరగనున్నాయి. డెక్కన్ ఎరీనాలో రేపు (గురువారం) రాజస్థాన్ యునైటెడ్ ఎఫ్‌సీతో శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనుంది. హైదరాబాద్ తరఫున శ్రీనిధి డెక్కన్ ఎఫ్‌సీ తలపడనున్న నేపథ్యంలో మ్యాచ్‌కి పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కోరారు.