News March 21, 2025
HYD: ఓయూ సర్కులర్పై హైకోర్టు స్టే

ఓయూ జారీ చేసిన సర్క్యులర్ మీద హైకోర్ట్ స్టే ఇచ్చింది. ఓయూ పరిధిలో ధర్నాలు, నిరసనలు బ్యాన్ చేస్తూ ఓయూ అధికారులు ఈ నెల 13వ తేదిన ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు చట్ట విరుద్ధమని రఫీ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై హైకోర్టులో విచారణ జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి, ఓయూ రిజిస్ట్రార్కు నోటీసులు జారీ చేస్తూ తదుపరి విచారణను కోర్టు ఏప్రిల్ 9కి వాయిదా వేసింది.
Similar News
News April 2, 2025
HYD: పల్లె నుంచి పట్నంకు తాటి ముంజలు

నగరవాసుల వేసవి తాపాన్ని తీర్చేందుకు తాటిముంజలు వచ్చేశాయి. ముషీరాబాద్, రాంనగర్ డౌన్, బయోలజికల్ ఈ లిమిటెడ్, అడిక్మెట్ ఫ్లై ఓవర్ తదితర ప్రాంతాల్లో ఈ వ్యాపారం జోరందుకుంది. డజన్ మంజలు రూ.120 నుంచి రూ.150 వరకు అమ్ముతున్నారు. ఇవి తింటే జీర్ణవ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. వడదెబ్బ తాకిన వారు వీటిని తింటే వెంటనే కోలుకుంటారు. ఆరోగ్యం మీద శ్రద్ధతో ధరలు ఎక్కువున్నా HYD వాసులు కొనేందుకు మొగ్గుచూపుతున్నారు.
News April 2, 2025
HYDలో అందమైన ప్రదేశాలు చూపిస్తానని అత్యాచారం

జర్మనీ యువతిపై అత్యాచారం కేసులో CP ఆదేశాలతో మహేశ్వరం DCP సునీత సీన్ రీ కన్స్ట్రక్షన్ చేశారు. సోమవారం సా. 6 గంటలకు యువతి, ఆమె స్నేహితుడిని అస్లాం కారులో ఎక్కించుకుని యాకుత్పురా, చార్మినార్లో తిప్పాడు. సిటీ శివారులో అందమైన ప్రదేశాలు చూపిస్తాను అంటూ పహడీషరీఫ్ తీసుకెళ్లాడు. యువతి ఫ్రెండ్ను కారు దింపి యూటర్న్ చేస్తాను అని నమ్మించాడు. కొద్దిదూరం తీసుకెళ్లి <<15963281>>ఆమెపై<<>> అత్యాచారం చేశాడు ప్రబుద్ధుడు.
News April 2, 2025
HYD: CM రేవంత్ రెడ్డికి రాజాసింగ్ లేఖ

శ్రీరామనవమి శోభాయాత్రకు ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించాలని BJP ఎమ్మెల్యే రాజాసింగ్ సీఎం రేవంత్ రెడ్డికి లేఖ రాశారు. 15 ఏళ్లుగా శాంతియుతంగా నిర్వహిస్తున్న యాత్రకు పోలీసులు శబ్ద నియంత్రణ పేరుతో ఆంక్షలు వేస్తున్నారని ఆయన ఆక్షేపించారు. ఇతర మతాలకు ఇలా ఆంక్షలు ఉన్నాయా? అని ప్రశ్నించారు. యాత్రను నిర్బంధం లేకుండా నిర్వహించేందుకు అనుమతివ్వాలని కోరారు.