News December 17, 2024

HYD: ఓవైపు చలి.. మరోవైపు పొల్యూషన్.. డేంజర్..!

image

HYDలో ఓవైపు చలి తీవ్రత పెరుగుతుండగా, గాలి కాలుష్యం సైతం పెరిగినట్లు CPCB తెలిపింది. సనత్‌నగర్‌లో-171, పాశమైలారంలో -163, నెహ్రూ జూపార్క్-160, పటాన్‌చెరు-149, సెంట్రల్ యూనివర్సిటీ-125, బొల్లారం-117, కొంపల్లి-102 గాలినాణ్యత సూచి(AQI) నమోదయింది. పైప్రాంతాలకు PCB ఎల్లో అలర్ట్ జారీ చేసింది. అత్యధిక చలి, పొల్యూషన్ నమోదవుతున్న వేళ ఊపిరితిత్తులు, శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలంది.

Similar News

News January 18, 2025

HYD: ఇంటర్ విద్యార్థుల ALERT.. ఈనెల 25 వరకు అవకాశం

image

ఇంట‌ర్ ఫ‌స్టియ‌ర్, సెకండియ‌ర్ విద్యార్థుల‌ను ఇంటర్మీడియ‌ట్ బోర్డు అప్ర‌మ‌త్తం చేసింది. వార్షిక ప‌రీక్ష‌ల‌కు సంబంధించిన ఫీజును ఇప్ప‌టికీ చెల్లించ‌ని విద్యార్థులు.. ఆల‌స్య రుసుం రూ. 2500తో జ‌న‌వ‌రి 25 వ‌ర‌కు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించింది. ఇంట‌ర్ రెగ్యుల‌ర్, వొకేష‌న‌ల్ విద్యార్థుల‌తో పాటు ప్రైవేటు విద్యార్థులు కూడా ఈ అవ‌కాశాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించింది.

News January 18, 2025

HYD: రాష్ట్రంలో రేవంత్ దోపీడీ ముఠా: కేటీఆర్

image

రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన దోపీడీ ముఠా రాష్ట్రంలో తిరుగుతుందని మాజీమంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రగతి భవన్‌లో చిట్ చాట్‌లో KTR మాట్లాడుతూ.. రేవంత్ సోదరులతో పాటు ఆరుగురి టీం కంపెనీల నుంచి వసూళ్ల కోసం రేవంత్ రెడ్డి తిప్పుతున్నాడని అన్నారు. తిరుపతిరెడ్డి, కొండల్ రెడ్డి, వేం నరేందర్ రెడ్డి, రోనిన్ రెడ్డి, ఫహీం ఖురేషి, ఏవి రెడ్డితో కూడిన ఆలీబాబా అర డజన్ దొంగల గ్యాంగ్ తెలంగాణలో తిరుగుతుందని అన్నారు.

News January 17, 2025

రంగారెడ్డి : హైదరాబాద్‌లో తగ్గిన వాయు కాలుష్యం

image

సంక్రాంతి పండగ నేపథ్యంలో హైదరాబాద్ వాసులంతా సొంతూళ్లకు వెళ్లారు. దీంతో నగరంలో వాయు కాలుష్యం తగ్గుముఖం పట్టిందని అధికారులు తెలిపారు. ముఖ్యంగా నివాస వాణిజ్య ప్రాంతాల్లో కాలుష్య కారకాలు గణనీయంగా తగ్గిపోగా.. పారిశ్రామిక వాడల్లో మాత్రం కాస్త అధికంగా నమోదైందన్నారు. ఈ నేపథ్యంలో సంక్రాంతి పండుగ ముగియడంతో మళ్లీ హైదరాబాదులో కాలుష్యం గణనీయంగా పెరిగిపోతుందని అధికారులు పేర్కొన్నారు.