News October 28, 2024
HYD: ఓ భార్య కీచక పర్వం..
డబ్బుకోసం భర్తను కిరాతకంగా హత్య చేసిన ఘటన HYD శివారు పోచారంలో జరిగింది. పోలీసుల వివరాలు.. 3 పెళ్లిళ్లైన నిందితురాలు విహారికకు వ్యాపారి బి.రమేశ్‌తో 2018లో ప్రేమ వివాహం జరిగింది. తర్వాత APకి చెందిన నిఖిల్‌తో ప్రేమలో పడింది. ఇటీవల భర్త ఆస్తి అమ్మగా రూ.8 కోట్లు వచ్చాయి. ఆ డబ్బుపై కన్నేసి, అంకుర్ అనే మరో వ్యక్తితో కలిసి ఉప్పల్‌లో హత్యచేసి కర్ణాటకలో పడేశారు. పోలీసులు విచారణ జరపగా పట్టుబడ్డారు.
Similar News
News November 4, 2024
మరింత అందంగా మన హైదరాబాద్
మన హైదరాబాద్‌ను జీహెచ్ఎంసీ మరింత అందంగా ముస్తాబుచేస్తోంది. బల్దియా పరిధిలోని అన్ని జంక్షన్లను సుందరీకరిస్తున్నారు. ఎల్బీనగర్, బషీర్‌బాగ్, ఖైరతాబాద్, పంజాగుట్ట, కూకట్‌పల్లి, హయత్‌నగర్, బీఎన్‌రెడ్డినగర్‌తో పాటు ఇతర ఏరియాల్లోని ఫ్లై ఓవర్లు, జంక్షన్ల వద్ద రంగు రంగుల బొమ్మలు గీస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నళ్ల వద్ద ఈ చిత్రాలు వాహనదారులను ఆకట్టుకుంటున్నాయి.
News November 3, 2024
HYD: చికెన్ ఫ్రైలో పురుగుపై కోర్టులో కేసు
హైదరాబాద్‌లోని సైబర్ టవర్స్ ఎదురుగా ఉన్న మెహ్ ఫిల్ రెస్టారెంట్లో స్విగ్గి ద్వారా అనిరుద్ అనే వ్యక్తి చికెన్ నూడిల్స్, చికెన్ ఫ్రై, తదితర ఆర్డర్ చేయగా.. చికెన్ ఫ్రైలో పురుగు వచ్చిన సంగతి తెలిసిందే. జీహెచ్ఎంసీకి ఫిర్యాదు అందించగా, యంత్రాంగం కదిలింది. పూర్తిగా తనిఖీలు చేపట్టిన అధికారులు, అసురక్షిత ఆహార పదార్థాలను గమనించి, టెస్టింగ్ కోసం శాంపిల్స్ సేకరించారు. దీనిపై కోర్టులో కేసు వేస్తామని తెలిపారు.
News November 3, 2024
మూసి నిర్వాసితులకు 2BHK..చకచకా పనులు
మూసి నిర్వాసితులకు అంబర్పేట, హిమాయత్ నగర్ ముసారం బాగ్, కేసీఆర్ నగర్ పరిధిలో కొందరికి ఇప్పటికే 2BHK ఇండ్లను పట్టాలిచ్చి ఖాళీ చేయించారు. మరోవైపు పిల్లిగుడిసెల కాలనీ, ప్రతాప సింగారం, సాయి చరణ్ కాలనీ, కమలానగర్, కొల్లూరు, గాంధీనగర్, జై భవాని నగర్, తిమ్మాయిగూడ, నార్సింగి, బండ్లగూడ, పోచంపల్లి బాచుపల్లి ఇలా మొత్తం దాదాపు 14 ప్రాంతాలకు మూసి నిర్వాసితులను తరలించేందుకు అధికారులు సిద్ధం చేశారు.