News July 26, 2024
HYD: ఓ వైపు కుక్కలు.. మరోవైపు కామాంధులు..!
గ్రేటర్ HYDలో చిన్నారుల ప్రాణాలకు భరోసా లేకుండా పోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఓ వైపు కుక్కలు దాడి చేస్తుండగా మరోవైపు కామాంధులు అభంశుభం తెలియని చిన్నారులపై అత్యాచారం చేస్తున్నారు. ఇటీవల పిల్లలపై కుక్కల దాడులు, అత్యాచారాల ఘటనలు పెరిగాయని ఆరోపణలు వస్తున్నాయి. తమ పిల్లలను బయటకు పంపాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడిందని తల్లిదండ్రులు వాపోతున్నారు. చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Similar News
News October 7, 2024
HYD: మంత్రి తుమ్మల తీపికబురు
మంత్రి తుమ్మల నాగేశ్వరరావు రాష్ట్ర రైతాంగానికి తీపి కబురు అందించారు. రైతుల రుణమాఫీ ప్రక్రియ పూర్తి కాగానే రైతు భరోసా నిధులు వారి ఖాతాల్లో వేస్తామని మంత్రి వెల్లడించారు. సోమవారం గాంధీభవన్‌లో మంత్రులతో ప్రజల ముఖాముఖి కార్యక్రమంలో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. తెలంగాణలో రుణమాఫీ హామీ అమలు కాలేదని ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలు అర్థరహితమన్నారు.
News October 7, 2024
HYD: విషాదం.. లిఫ్ట్ అడిగి ప్రాణం కోల్పోయాడు..!
HYD బాలాపూర్ పరిధి మీర్‌పేట్ PS పరిధిలో ఈరోజు <<14293025>>రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చనిపోయిన<<>> విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. డ్రైవర్‌గా పని చేస్తున్న షేక్ మదినా పాషా (42) ఈరోజు ఉదయం TKR కమాన్ వైపు వెళ్తుండగా శ్రవణ్ (38) అనే వ్యక్తి అతడిని లిఫ్ట్ అడిగాడు. అతడిని బైక్ ఎక్కించుకుని కలిసి వెళ్తుండగా లారీ వారి బైక్‌ను వేగంగా ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే చనిపోయారు.
News October 7, 2024
అన్నపూర్ణాదేవి అలంకరణలో బల్కంపేట ఎల్లమ్మ
తెలంగాణలోనే ప్రసిద్ధి చెందిన అమ్మవారి ఆలయాల్లో ఒకటి గల బల్కంపేట ఎల్లమ్మ గుడిలో ఈరోజు ఉదయం నుంచి భక్తులతో కిటకిటలాడుతోంది. అమ్మవారు నేడు అన్నపూర్ణ దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయంలో ఉదయం నుంచి భక్తులు అమ్మవారి దర్శనం కోసం బారులు తీరారు. మొదటి రోజు నుంచే అమ్మవారిని దర్శించుకోవడం కోసం భక్తులు నగరం నలుమూలల నుంచి అధిక సంఖ్యలో వస్తున్నట్లు ఆలయ అధికారులు తెలిపారు.