News December 30, 2024

HYD: కనుమరుగవుతున్న చెరువులు..!

image

రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, HYD జిల్లాల పరిధిలో దాదాపుగా 24 చెరువులు పూర్తిగా కబ్జాకు గురై కనుమరుగైనట్లు TGRAC తెలిపింది. 2014కు ముందు ఈ ఆక్రమణలు జరిగినట్లుగా పేర్కొంది. రాష్ట్రం ఏర్పడ్డాక మేడ్చల్ జిల్లాలో 28, రంగారెడ్డి జిల్లాలో 22, సంగారెడ్డి జిల్లాలో 7 చెరువులు పాక్షిక ఆక్రమణకు గురయ్యాయని వెల్లడించింది.

Similar News

News November 13, 2025

అగ్నిమాపక వ్యవస్థ.. గాంధీ ఆస్పత్రిలో అవస్థ

image

సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో అగ్నిమాపక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. వేలమంది ఆస్పత్రికి చికిత్స కోసం వస్తుంటారు. వారి వెంట అటెండెంట్లు కూడా ఉంటారు. ఇక సిబ్బంది సరేసరి.. ఇంతమంది ఉన్నపుడు అంత పెద్ద భవనంలో అగ్నిమాపక వ్యవస్థను పకడ్బందీగా ఏర్పాటు చేయాల్సిన అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. 8 అంతస్తుల భవనంలో ఇప్పటికైనా పకడ్బందీగా ఫైర్ సేఫ్టీ సిస్టం ఏర్పాటు చేయాలని పలువురు కోరుతున్నారు.

News November 13, 2025

HYD: ఆస్పత్రికి వెళ్లాలంటే ‘కంటి’ పరీక్ష

image

సరోజినిదేవి కంటి ఆస్పత్రి.. రోజుకు కనీసం వెయ్యి మంది చికిత్సకు వస్తుంటారు. వీరంతా బస్సు దిగిన తర్వాత (మెహిదీపట్నం వైపు) రోడ్డు దాటాలంటే గుండెలు జారిపోతాయి. వందలాది వాహనాలు రోడ్లపై రయ్ మంటూ దూసుకెళుతుంటాయి. ఆ పరిస్థితుల్లో రోడ్డు దాటడానికి అష్టకష్టాలు పడుతున్నారు. అసలే కంటి సమస్యతో బాధపడుతూ ఆస్పత్రికి వస్తుంటే.. ఈ రోడ్డెలా దాటాలి సారూ అని వాపోతున్నారు. ఓ వంతెన నిర్మించొచ్చు కదా అని కోరుతున్నారు.

News November 13, 2025

సికింద్రాబాద్ రైల్వేస్టేషన్.. ఇలాగేనా అంతర్జాతీయ స్థాయి నిర్మాణం?

image

విమానాశ్రయంలా.. ఇంటర్నేషనల్ రేంజ్‌లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మిస్తామని చెప్పిన ప్రభుత్వం ఇపుడు ఆ విషయం మరచిపోయినట్టుంది. రెండేళ్ల క్రితం ప్రారంభించిన ఈ పనులు ఇప్పటి వరకు సగం కూడా కాలేదు. రూ.714 కోట్లతో చేపట్టిన రీ డవలప్‌మెంట్ పనులు నత్తకే నడక నేర్పిస్తున్నట్లున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. సాధ్యమైనంత త్వరగా పూర్తిచేసి అందుబాటులోకి తేవాలని ప్రయాణికులు కోరుతున్నారు.