News November 13, 2024

HYD కమిషనరేట్ పరిధిలో సీఐలకు పోస్టింగ్

image

హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వెయిటింగ్‌లో ఉన్న 17 మంది సర్కిల్ ఇన్‌స్పెక్టర్లకు పోస్టింగ్ ఇస్తూ నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఉత్తర్వులు జారీ చేశారు. వారిలో 11 మందిని వివిధ స్టేషన్లలో డీఐలుగా నియమించగా, ముగ్గురిని సీసీఎస్‌లో, ముగ్గురికి ఎస్‌బీలో పోస్టింగ్ ఇచ్చారు. వీరంతా త్వరలోనే బాధ్యతలు స్వీకరించనున్నారు.

Similar News

News December 9, 2024

గాంధీభవన్‌లో మెగా రక్తదాన శిబిరం

image

గాంధీ భవన్‌లో సోనియాగాంధీ 79వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా టీపీసీసీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మెగా రక్త దాన శిబిరాన్ని ఏఐసీసీ ఇన్‌ఛార్జ్ దీపాదాస్ ముంన్షి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ ప్రారంభించారు. కార్యక్రమంలో మంత్రి పొన్నం ప్రభాకర్, డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

News December 9, 2024

WOW.. HYD: ముస్తాబు అదిరిందిగా..!

image

సాధారణంగా బైక్ ప్రియులు తమ వాహనాలను తమకు నచ్చిన విధంగా డిజైన్ చేయించుకుంటారు. కొందరు హీరోల బొమ్మలను, దేవుళ్లను స్టికర్లుగా వేయించుకుంటే కొందరు భిన్నంగా తమ బండ్లను WOW అనిపించేలా తీర్చిదిద్దుకుంటారు. పైఫొటోలో కనిపిస్తున్న యాక్టివా ఈ కోవలోకే వస్తుంది. ఓ వ్యక్తి తన వాహనాన్ని ఇలా రకరకాల ఇమిటేషన్ జ్యువెలరీతో అద్భుతంగా ముస్తాబు చేశాడు. మొజాంజాహీ మార్కెట్ చౌరస్తాలో కనిపించింది ఈ చిత్రం.

News December 9, 2024

REWIND: NIMS‌లో KCR దీక్ష విరమణ

image

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ‌భవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.