News May 4, 2024
HYD: కరెంట్ బిల్లు చూసి షాక్ అయ్యాడు..!

HYD మల్కాజిగిరి వసంతపురి కాలనీకి చెందిన నవీన్ కుమార్ అనే వ్యక్తికి ఏకంగా రూ.1,75,173 కరెంటు బిల్లు వచ్చిందని వాపోయాడు. జీరో బిల్లు రావాల్సిన అతడికి రూ.లక్షల్లో బిల్లు రావడంతో ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. ఈ విషయమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వెళితే వారు స్పందించడం లేదని బాధితుడు తెలిపాడు. అంతకుముందు రెండు నెలల్లో ఒకసారి రూ.600, మరోసారి రూ.1,438 బిల్లు వచ్చినట్లు తెలిపారు.
Similar News
News November 14, 2025
జూబ్లీబైపోల్: పోస్టల్ బ్యాలెట్లో కాంగ్రెస్‌కు 47 ఓట్లు

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో భాగంగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ముగిసింది. పోస్టల్ బ్యాలెట్లో మొత్తం 101 మంది హోం ఓటింగ్ వేశారు. వీరిలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు 47 మంది ఓటేశారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతకు 43 ఓట్లు పడ్డాయి. ఇక బీజేపీ అభ్యర్థి లంకల దీపక్ రెడ్డికి 11 ఓట్లు మాత్రమే వచ్చాయి. ప్రస్తుతం మొదటి రౌండ్లో భాగంగా షేక్‌పేట బూత్‌ల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.
News November 14, 2025
హైదరాబాద్‌లో పెరుగుతున్న చలి తీవ్రత!

గ్రేటర్ హైదరాబాద్‌లో రోజురోజుకు చలి తీవ్రత పెరుగుతూ వస్తోంది. నేడు తెల్లవారుజామున అత్యల్పంగా శేరిలింగంపల్లి HCU పరిసర ప్రాంతాల్లో 8.8C నమోదు కాగా, రాజేంద్రనగర్‌లో 10.7, BHEL 11.7, బొల్లారం, మారేడ్‌పల్లి, గచ్చిబౌలి 11.7, కుత్బుల్లాపూర్ 12.2, జీడిమెట్ల 12.7 సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని అధికారులు తెలిపారు. మరో నాలుగు రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
News November 14, 2025
Jubilee Hills Counting: రౌండ్లు.. డివిజన్ల వివరాలు

రౌండ్.1: షేక్‌పేటలోని 42 బూత్‌లు
రౌండ్.2:షేక్‌పేట, ఎర్రగడ్డ, వెంగళరావునగర్-42బూత్‌లు
రౌండ్.3:ఎర్రగడ్డ, వెంగళరావునగర్, రహమత్‌నగర్-42బూత్‌లు
రౌండ్.4&5:రహమత్‌నగర్, వెంగళరావునగర్-84 బూత్‌లు
రౌండ్.6&7:వెంగళరావునగర్, యూసుఫ్‌గూడ, సోమాజిగూడ-84 బూత్‌లు
రౌండ్.8&9:సోమాజిగూడ, ఎర్రగడ్డ, బోరబండ-84 బూత్‌లు
రౌండ్.10: ఎర్రగడ్డలోని 29 బూత్‌ల లెక్కింపు జరగనుంది.


