News February 15, 2025

HYD: కళ్లు చెదిరేలా ఆటో డ్రైవర్ కొడుకు ఆర్ట్స్

image

HYD నగరానికి చెందిన రాజేష్ నాయక్ అద్భుత ప్రదర్శనతో అందర్నీ ఆకట్టుకున్నాడు. ఆర్టిస్ట్ రాజేష్ నాయక్ ఆటో డ్రైవర్ కొడుకు కావడం గర్వంగా ఉందన్నారు. ఆటోలు నడపడం ఎంత ఇష్టమో, వాటిని తన ఇతివృత్తంగా చేసుకోవడం కూడా అంతే ఇష్టం అని తెలిపారు. ఈ ఆర్ట్ వర్క్స్ సృష్టించడానికి రెక్జిన్, మెటల్ మొదలైన వాటిని ఉపయోగించినట్లు తెలిపారు. X వేదికగా హైదరాబాద్ ప్రముఖ జర్నలిస్ట్ రాజేశ్వరి అతడిని అభినందించారు.

Similar News

News December 6, 2025

VJA: హిడ్మా ఎన్‌కౌంటర్.. ఇద్దరు వ్యాపారుల పాత్రపై దర్యాప్తు

image

హిడ్మా ఎన్‌కౌంటర్ నేపథ్యంలో విజయవాడలో ఇద్దరు వ్యాపారుల పేర్లు తెరమీదకి వచ్చాయి. వీరు మావోయిస్టుల మద్దతుదారులా? లేక పోలీసుల ఇన్‌ఫార్మర్లా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇటీవల పెనమలూరులో పట్టుబడిన మావోయిస్టులతో వీరికి సంబంధాలున్నాయా అనే కోణంలో ఇంటెలిజెన్స్ శాఖ దర్యాప్తును వేగవంతం చేసింది.

News December 6, 2025

టాస్ గెలిచిన భారత్

image

విశాఖలో సౌతాఫ్రికాతో జరిగే మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. 20 వన్డేల తర్వాత టీమ్ ఇండియా టాస్ గెలవడం విశేషం. సుందర్ స్థానంలో తిలక్ వర్మ జట్టులోకి వచ్చారు.

భారత్: జైస్వాల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (C), తిలక్ వర్మ, జడేజా, అర్ష్‌దీప్ సింగ్, హర్షిత్ రాణా, కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధ్ కృష్ణ.

News December 6, 2025

4,116 పోస్టులు.. దరఖాస్తు చేశారా?

image

RRC నార్తర్న్ రైల్వేలో 4,116 అప్రెంటిస్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. టెన్త్, ఐటీఐ అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 24వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 24ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.100. టెన్త్, ఐటీఐలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: www.rrcnr.org