News August 31, 2024

HYD: కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు: చేవెళ్ల ఎంపీ

image

BJP సహకారంతో సుప్రీంకోర్టు కవితకు బెయిల్ ఇవ్వలేదని చేవెళ్ల MP కొండా విశ్వేశ్వర్ రెడ్డి అన్నారు. సుప్రీం తీర్పుపై ప్రతిపక్షాలు చేసిన వ్యాఖ్యలు సమంజసం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. తాము ఎన్నటికీ BRSతో కలవమని తేల్చి చెప్పారు. గతంలో INC ఎమ్మెల్యేలు కారెక్కారన్నారు. ఇప్పుడు అదే ఎమ్మెల్యేలు మళ్లీ హస్తం కండువా కప్పుకొంటున్నారని ఎంపీ పేర్కొన్నారు. కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకుందని కొండా ఆరోపించారు.

Similar News

News November 21, 2025

దానం డిసీషన్.. ఓవర్ టూ ఢిల్లీ

image

పార్టీ ఫిరాయింపుల ఆరోపణలకు సంబంధించి MLA దానం నాగేందర్ కాంగ్రెస్ పెద్దలతో సంప్రదించేందుకు ఢిల్లీకి వెళ్లినట్లు సమాచారం. గతంలోనే స్పీకర్ కార్యాలయం దానంకు నోటీసులు అందజేసింది. ఆయన స్పందించకపోవడంతో మరోసారి నోటీసులు పంపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు 4 వారాల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉండగా.. దానం ఇంతవరకు సమాధానం ఇవ్వలేదు. దీంతో ఢిల్లీ పెద్దలతో దానం చర్చించి నిర్ణయం తీసుకుంటారని టాక్.

News November 21, 2025

HYD: గ్లోబల్ సమ్మిట్‌కు సామాన్యులకూ ఛాన్స్?

image

వచ్చేనెల 8, 9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబస్ సమ్మిట్‌ను ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం సర్కారు భారీ ఏర్పాట్లు చేస్తోంది. 100 ఎకరాల్లో సదస్సు నిర్వహిస్తారు. వందలాది స్టాల్స్ ఏర్పాటు చేస్తారు. 1,300 కంపెనీలు పాల్గొనే అవకాశముంది. ఇదిలా ఉండగా పెద్ద ఎత్తున నిర్వహించే ఈ కార్యక్రమాన్ని 10, 11 తేదీల్లో రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల ప్రజలు చూసే సౌకర్యం కల్పించినట్లు సమాచారం.

News November 21, 2025

భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్

image

HYD నుంచి భువనేశ్వర్ వెళ్లే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు గుడ్‌న్యూస్ తెలిపారు. డిసెంబర్ 2 నుంచి ప్రత్యేక రైలు నడుపుతున్నట్లు సీపీఆర్ఓ శ్రీధర్ తెలిపారు. ప్రతి మంగళవారం నాంపల్లి రైల్వే స్టేషన్ నుంచి భువనేశ్వర్(07165) ట్రైన్, అలాగే ప్రతి బుధవారం భువనేశ్వర్ నుంచి నాంపల్లి (07166) ట్రైన్ ప్రయాణికులకు సేవలందిస్తాయన్నారు. వచ్చేనెల 23 వరకు ఈ ప్రత్యేక రైలు ఉంటుందన్నారు.