News November 28, 2024
HYD: కాంగ్రెస్ను బద్నాం చేద్దామని BRS ప్లాన్: కల్వ సుజాత
BRSవాళ్లు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బద్నాం చేద్దామని పక్కా ప్లాన్ వేసుకున్నారని తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్ ఛైర్పర్సన్ కల్వ సుజాత మండిపడ్డారు. ఈరోజు HYDగాంధీభవన్లో ఆమె మాట్లాడుతూ..గురుకులంలో గంట ముందు తిన్న పిల్లలు బాగున్నారని, తర్వాత అదే అన్నం తిన్న విద్యార్థులకు మాత్రం ఫుడ్ పాయిజన్ ఎలా జరిగిందని అనుమానం వ్యక్తం చేశారు.‘రాజకీయం కోసం పసి పిల్లలను బలి తీసుకునే వెధవలు BRSవాళ్లు’ అని ఫైర్ అయ్యారు.
Similar News
News November 28, 2024
HYD: 26 వేల టీచర్ పోస్టులు భర్తీ చేయాలి: ఆర్.కృష్ణయ్య
వచ్చే డీఎస్సీలో 26 వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య డిమాండ్ చేశారు. దిల్సుఖ్నగర్లో జరిగిన నిరుద్యోగుల సభలో మాట్లాడుతూ.. విద్యాశాఖ అధికారులు టీచర్ పోస్టుల సంఖ్యను తక్కువ చేసి చూపిస్తున్నారని ఆరోపించారు. ఏ పాఠశాలకు వెళ్లినా టీచర్ల కొరత ఉందన్నారు. ఎయిడెడ్ పాఠశాలలో 6 వేలకుపైగా పోస్టులు ఖాళీగా ఉన్నా వాటి భర్తీకి నోటిఫికేషన్ ఇవ్వటం లేదన్నారు.
News November 28, 2024
HYD: జాతీయ రహదారులపై మంత్రి కోమటిరెడ్డి సమావేశం
భువనగిరి పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారుల అభివృద్ధిపై కీలక సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్లు, భవనాల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, భువనగిరి MPచామల కిరణ్ కుమార్ రెడ్డి, R&B ఛైర్మన్ మల్రెడ్డి రాంరెడ్డి పాల్గొన్నారు. అధికారులతో కలిసి వారు భువనగిరి పరిధిలోని రహదారుల అభివృద్ధి, మరమ్మతులపై చర్చించారు. జాతీయ రహదారుల అభివృద్ధిపై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు.
News November 28, 2024
HYDకు వచ్చిన డేంజర్ గ్యాంగ్.. పోలీసుల క్లారిటీ
వీధుల్లో లేడీస్ సూట్లు, దుప్పట్లు, బెడ్ షీట్లు అమ్ముతూ దోపిడీలకు పాల్పడే ముఠా హైదరాబాద్కు వచ్చిందని ఓ న్యూస్ వైరల్ అవుతోంది. బీదర్, గుల్బర్గాలోని గ్యాంగ్స్టర్లు నగరానికి వచ్చారని పలువురు సోషల్ అకౌంట్లలో ఫొటోలు షేర్ చేస్తున్నారు. అయితే, ఇది పూర్తిగా అవాస్తవమని ఉన్నతాధికారులు క్లారిటీ ఇచ్చారు. పాత ఫొటోలను వైరల్ చేస్తున్నారని స్పష్టం చేశారు.
SHARE IT