News April 9, 2024
HYD: కాంగ్రెస్లోకి అంబర్పేట MLA.. క్లారిటీ

తాను కాంగ్రెస్ పార్టీలో చేరతానని కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని అంబర్పేట MLA కాలేరు వెంకటేశ్ అన్నారు. ఇదంతా హస్తం పార్టీ మైండ్ గేమ్ అని ఆరోపించారు. బీఆర్ఎస్ పార్టీని వీడే ప్రసక్తి లేదని ఆయన స్పష్టం చేశారు. 2 పర్యాయాలు తనను ఎమ్మెల్యేగా గెలిపించింది కారు గుర్తు అన్నారు. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే తాను ఎమ్మెల్యే అయ్యాయని కాలేరు వెల్లడించారు.
Similar News
News November 12, 2025
HYD: పెళ్లి చేసుకుందామంటే పిల్ల దొరకట్లే సారూ!

HYD, రంగారెడ్డి, మేడ్చల్లో ORR వరకు నిర్వహించిన సర్వేలో పెళ్లిపిల్ల కోసం అనేకులు దరఖాస్తులు చేసుకుంటున్నప్పటికీ, వధువు దొరకడం లేదని యంగ్ ఏజ్ మ్యారేజ్ సర్వే వెల్లడించింది. కాగా.. 3 ఏళ్లలో దాదాపు 45 శాతం మందికి అమ్మాయిలు దొరకక ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలిపారు. దీనికి ఉద్యోగం, సంపాదన, సొంతిళ్లు ఇలా పలు కారణాలు ఉన్నాయంది. ఓవైపు పిల్ల దొరకక, మరోవైపు వయసు మీద పడుతుంటే సింగిల్స్కు టెన్షన్ పెరుగుతోంది.
News November 12, 2025
HYD: డోర్లు మినహా.. మిగతా చోట్ల గ్రిల్స్ ఏర్పాటు!

ప్రమాదల నివారణకు మెట్రో మరో అడుగు ముందుకేసింది. అమీర్పేట ఎక్స్టెన్షన్ కావడంతో రద్దీ బీభత్సంగా ఉంటుంది. ఈ నేపథ్యంలో L&T ఆధ్వర్యంలో ప్లాట్ ఫాం వద్ద స్పెషల్ డోర్లు కాకుండా, గ్రిల్స్ ఏర్పాటు చేస్తున్నారు. మెట్రో డోర్ ఓపెన్ అయ్యే ప్రాంతాన్ని ఖాళీగా ఉంచి, మిగిలిన ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారు. త్వరలో అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.
News November 11, 2025
ప్చ్.. దేశంలోనే జూబ్లీహిల్స్ లాస్ట్!

ఎన్నికలు ఎప్పుడు జరిగినా పోలింగ్ శాతంలో మన హైదరాబాద్ చివరి స్థానంలో ఉంటుంది. దేశవ్యాప్తంగా 8 నియోజకవర్గాలకు ఉప ఎన్నిక జరిగింది. మిజోరంలోని డంపా 82.34 శాతంతో పోలింగ్లో నం.1 స్థానంలో నిలిచింది. మన జూబ్లీహిల్స్ మాత్రం 48.43% ఓటింగ్తో చివరి స్థానానికి పడిపోయింది. సెన్సిటివ్ ప్రాంతమైన జమ్మూకశ్మీర్లోని బడ్గాం నియోజకవర్గంలో మన కంటే 2% ఎక్కువే నమోదైంది. ఈ పరిస్థితి ఎప్పుడు మారుతుందో ఏమో?


