News April 5, 2024

HYD: కాంగ్రెస్ జన జాతర సభను విజయవంతం చేయండి: ఎంపీ

image

కాంగ్రెస్​ పార్టీ.. చేవెళ్ల పార్లమెంట్​ నియోజకవర్గ పరిధిలోని తుక్కుగూడలో శనివారం నిర్వహించ తలపెట్టిన జన జాతర భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎంపీ డాక్టర్​ జి.రంజిత్​ రెడ్డి పిలుపునిచ్చారు. హస్తం పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఈ మేరకు శుక్రవారం ఆయన సూచించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోను అగ్రనాయకత్వం ఈ సభ ద్వారా విడుదల చేస్తుందని అన్నారు.

Similar News

News November 12, 2025

HYD: జావా కోడింగ్‌పై 4 రోజుల FREE ట్రైనింగ్

image

బాలానగర్‌లోని CITD కేంద్రంలో 4రోజుల జావా కోడింగ్ ఫ్రీ ట్రైనింగ్ ఇవ్వన్నున్నట్లు CDAC బృందం ప్రకటించింది. ఐటీఐ ఫ్యాకల్టీ, పాలిటెక్నిక్ కాలేజీలు, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచింగ్ ప్రొఫెషనల్స్ STEM సబ్జెక్టులు బోధించే వారికి ఇది సువర్ణ అవకాశంగా పేర్కొన్నారు. జావా కోడింగ్‌పై పట్టు సాధించాలని అనుకున్నవారు, నవంబర్ 20 సా.5 గంటలలోపు tinyurl.com/mvutwhub లింక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి.

News November 12, 2025

జూబ్లీ బైపోల్.. ఫలితాలపై ఎవరి ధీమా వారిదే!

image

రాష్ట్ర రాజకీయాలను మలుపు తిప్పే జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ మంగళవారం ముగిసింది. 48.49 శాతం పోలింగ్ నమోదు కాగా ఫలితాల్లో తమదే విజయమంటూ ప్రధాన పార్టీల అభ్యర్థులు చెబుతున్నారు. పోల్ మేనేజ్‌మెంట్ పక్కాగా జరిగిందని, తామే గెలుస్తామని కాంగ్రెస్ చెబుతోంది. ఇక ఎన్ని ప్రలోభాలు ఎదురైనా సైలెంట్ ఓటింగ్‌తో తమదే గెలుపు అని BRS ధీమాగా ఉంది. ఇక ఎగ్జిట్ పోల్స్ అనంతరం కమలనాథులు సందిగ్ధంలో ఉన్నారు. గెలుపెవరిదో..?

News November 12, 2025

WOW.. HYDలో ఇప్పపువ్వు లడ్డూలు

image

HYDలో నాంపల్లి, శేర్లింగంపల్లి లాంటి పలు ప్రాంతాల్లో ఇప్ప పువ్వు లడ్డూలు కనపడుతున్నాయి. ఆదిలాబాద్ ఉట్నూర్ ప్రాంతానికి చెందిన ఆదివాసీ మహిళలు స్థానిక వ్యాపార రంగంలో కొత్త ఉరవడికి నాంది పలికారు. ఎన్నో పోషకాలున్న ఈ లడ్డూ రక్తహీనత తగ్గించే, వ్యాధి నిరోధకశక్తినిస్తుందని వైద్యనిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు HYDలో భీమాబాయి మహిళా సహకార సంఘం ఈ ఉత్పత్తుల ద్వారా ఏడాదికి రూ.1.27 కోట్ల ఆదాయం పొందుతోంది.