News February 2, 2025

HYD: కాంగ్రెస్ ధర్నాకు తరలిరావాలి: మంత్రి పొన్నం 

image

బడ్జెట్‌లో తెలంగాణపై వివక్షకు నిరసనగా నేడు టీపీసీసీ ఆధ్వర్యంలో జరిగే భారీ ధర్నాను విజయవంతం చేయలని మంత్రి పొన్నం ప్రభాకర్ పిలుపునిచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పిలుపు మేరకు ట్యాంక్ బండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద జరిగే నిరసన కార్యక్రమంలో నగరంలోని ప్రతి కార్యకర్త పాల్గొనాలన్నారు.

Similar News

News February 2, 2025

HYD: కేంద్రం మొండిచేయి చూపింది: మహేష్ గౌడ్

image

తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం వివక్ష చూపుతుందని TPCC అధ్యక్షుడు మహేశ్ గౌడ్ అన్నారు. ఎన్నికల జరిగే రాష్ట్రాల్లోని కేంద్ర నిధులు ఇస్తుందని, అభివృద్ధి అంటే బీజేపీ ఇష్టంగా మారిందన్నారు. ఎన్నికల గెలవాలని ఉద్దేశంతోనే నిధులు ఇచ్చారని, మోదీకి అనేకసార్లు కలిసి విన్నవించినా కనికరించలేదన్నారు. రాష్ట్రానికి కేంద్రం మొండి చేయి చూపించిందని, రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై రాజకీయాలకు అతీతంగా పోరాటం చేయాలన్నారు.

News February 2, 2025

HYD: సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39వ షోరూం ప్రారంభం

image

సంప్రదాయం, ఆధునికత మేళవింపుతో అద్భుతమైన వస్త్రాలను అందుబాటులో అందిస్తున్న సౌత్ ఇండియా షాపింగ్ మాల్ 39వ షోరూంను మహబూబ్ నగర్ క్లాక్ టవర్‌లో శనివారం ప్రారంభించింది. నటి ఊర్వశి రౌతేలా జ్యోతి ప్రజ్వలన చేశారు. సంస్థ డైరెక్టర్లు సురేష్ సీర్ణ, అభినయ్, రాకేశ్, కేశవ్ మాట్లాడుతూ.. అందరి అభిరుచులకు అనుగుణంగా, వివాహాది శుభకార్యాల కోసం ప్రత్యేక కలెక్షన్ ఆఫర్లలో అందుబాటులో ఉన్నాయన్నారు.

News February 2, 2025

HYD: బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు

image

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌రోడ్ నెంబర్ 36లోని పొష్ణోష్ లౌంజ్ బార్‌లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఫుడ్ లైసెన్స్ ముగిసినా బార్ నడుపుతున్నారని వారు చెప్పారు. వంటల్లో గడువు ముగిసిన పెప్పర్స్, ఆయిల్‌ వాడుతున్నారని వాటిని సీజ్ చేసినట్లు చెప్పారు.