News October 22, 2024

HYD: కాంగ్రెస్ పాలనలో రైతాంగం మోసపోతుంది: హరీశ్‌రావు

image

కాంగ్రెస్ పాలనలో రాష్ట్ర రైతాంగం అన్ని రకాలుగా మోసపోతున్నారాని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. రైతు బంధు ఇయ్యక, రుణమాఫీ చెయ్యక, బోనస్ అందక.. చివరకు పంట కొనుగోలు కూడా చేయకపోవడం అన్నదాతకు శాపంగా మారిందని మండిపడ్డారు. వెంటనే హామీలను నిలుపుకోవాలని హరీశ్‌రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. 

Similar News

News February 24, 2026

HYD: మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ ఇక చరిత్రే!

image

రాజేంద్రనగర్ మధు పార్క్ రిడ్జ్ అపార్ట్‌మెంట్‌ ఇక చరిత్రే. 2012 నిబంధనల ప్రకారం 50 మీటర్ల బఫర్ జోన్‌లో ఉండటంతో గతంలో అనుమతులున్నా మార్కెట్ రేటు చెల్లించి స్వాధీనం చేసుకుంటామని RDO వెంకటరెడ్డి కుండబద్దలు కొట్టారు. కిస్మత్‌పురా, దర్గా, ఉప్పర్‌పల్లిలో ఇప్పటికే నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. 60 రోజుల్లో అభిప్రాయాలు తీసుకొని పారదర్శకంగా ముందుకెళ్తామన్నారు. ఇక 500 మీటర్ల పరిధిలో ఇటుక పెట్టే ఛాన్సే లేదు.

News February 24, 2026

HYD: పర్యావరణం పేరుతో పాతాళానికి చెత్త!

image

జవహర్‌నగర్, దుండిగల్‌లో గుట్టుచప్పుడు కాకుండా 25 శాతం మిగులు వ్యర్థాలను అటవీ ప్రాంతాలకు తరలించేందుకు తెరవెనక పావులు కదులుతున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. వేస్ట్-టు-ఎనర్జీ తర్వాత మిగిలే ప్రమాదకర బూడిదను ఎకో-పార్కుల ముసుగులో భూమిలో పాతిపెట్టేందుకు క్లియరెన్సుల వేట సాగుతోంది. పర్యావరణ అనుమతులు రావడం కష్టమే అయినా, పక్కదారి పట్టించే ప్రయత్నం జరుగుతోందని పర్యావరణ వేత్తలు మండిపడుతున్నారు.

News February 24, 2026

మహిళా శక్తికి 20 ఏళ్లు.. భాగ్యనగరంలో YFLO జోష్!

image

‘ఆడవాళ్లు తలచుకుంటే ఆకాశమే హద్దు’ఇది మాటలు కాదు, 20ఏళ్ల నిలువెత్తు సాక్ష్యం. యువ మహిళా పారిశ్రామికవేత్తల వేదిక(YFLO) తన 20వ వార్షికోత్సవాన్ని బంజారాహిల్స్‌లో అట్టహాసంగా నిర్వహించింది. ఛైర్‌పర్సన్ పల్లవి జైన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకలో స్వాతిలక్రా, మహిమాదాట్ల, స్వప్నాదత్ పాల్గొన్నారు. నాయకత్వం అంటే అధికారం కాదు, బాధ్యతని చెబుతూ.. గత ఛైర్‌పర్సన్లను సన్మానించి మహిళా సాధికారతే లక్ష్యమని చెబుతున్నారు.