News September 7, 2024

HYD: కాంగ్రెస్ FAIL.. ఇంకెంత మంది చావాలి..?: KTR

image

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన వైఫల్యాన్ని అంగీకరించడానికి ఇంకెంత మంది రైతులు చావాలని..? BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTR ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మేడ్చల్‌లో దుబ్బాక రైతు సురేందర్ రెడ్డి ఆత్మహత్య గుండెను కలిచివేసిందని, ఇలాంటి బాధలు రావొద్దనే ప్రత్యేక తెలంగాణ కోసం పోరాటం చేశామన్నారు. రైతు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన KTR, రైతు వేదన వివరించలేనిదని పేర్కొన్నారు.

Similar News

News July 8, 2025

విఠలేశ్వర స్వామి కళ్యాణోత్సవంలో ఎమ్మెల్సీ కవిత

image

పురాణాపూల్‌లోని విఠలేశ్వర స్వామి ఆలయంలో సోమవారం జరిగిన కళ్యాణోత్సవంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పాల్గొన్నారు. భక్తిశ్రద్ధలతో జరిగిన ఈ వేడుకలో ఆమె ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఆలయ నిర్వహణపై ఆలయ పూజారులతో ఆమె చర్చించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, స్థానికులు, నాయకులు పాల్గొన్నారు.

News July 8, 2025

ప్రజావాణిలో సమస్యల పరిష్కారానికి కలెక్టర్ సూచనలు

image

లక్డికాపూల్‌లోని హైదరాబాద్ కలెక్టరేట్‌‌లో ప్రజావాణి నిర్వహించి, ప్రజల నుంచి అందిన అర్జీలను కలెక్టర్ హరిచందన దాసరి సమీక్షించారు. కలెక్టర్ అధికారులను ఉద్దేశించి అన్ని సమస్యలు వేగంగా పరిష్కరించాలని, పెండింగ్‌లో లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పాక్షికంగా కాకుండా పూర్తి స్థాయిలో పరిష్కరించాలని ఆమె సూచించారు.

News July 8, 2025

గాంధీ, ఉస్మానియాలపై దృష్టి సారించిన కలెక్టర్

image

గాంధీ ఉస్మానియా ఆస్పత్రులపై హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దృష్టి సారించారు. ప్రభుత్వ ఆస్పత్రులలో మౌలిక వసతుల కల్పనకు ప్రణాళికలు సిద్ధం చేసి నివేదిక ఇవ్వాలని వైద్య అధికారులను సూచించారు. కలెక్టరేట్లో ఉస్మానియా, గాంధీ ఆస్ప‌త్రుల వైద్యాధికారుల‌తో మెడిక‌ల్ కాలేజీల‌ మానిట‌రింగ్ క‌మీటి స‌మీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఉస్మానియా ఆస్పత్రిలోని సమస్యలను వెంటనే పరిష్కరిస్తామన్నారు.