News February 1, 2025
HYD: కాగ్ నివేదిక కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు: హరీశ్ రావు

కాళేశ్వరం సహా తెలంగాణ నీటి పారుదల వ్యవస్థపై కాంగ్రెస్ చేస్తున్న గోబెల్స్ ప్రచారం సుద్ధ తప్పు అని కాగ్ నివేదిక తేల్చి చెప్పిందని.. మిషన్ భగీరథపై కాంగ్రెస్ చేస్తున్న అసత్య ప్రచారాన్ని పటాపంచలు చేసిందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. కేంద్రం విడుదల చేసిన ఎకానమిక్ సర్వే 2024-25 నివేదిక బీఆర్ఎస్ పదేళ్ల పాలనపై అడ్డగోలు వ్యాఖ్యలు చేస్తున్న కాంగ్రెస్‌కు చెంపపెట్టు లాంటి సమాధానమన్నారు.
Similar News
News October 30, 2025
HYD: 1987 నాటి రైలు ఎలా ఉండేదో తెలుసా?

1987 నాటి ఈ అందమైన ఫొటో నాటి రైల్వే వ్యవస్థను గుర్తుచేస్తోంది. సికింద్రాబాద్ స్టేషన్‌కి అకోలా జంక్షన్ నుంచి వచ్చిన ప్రయాణికులను YP 2865 లోకోమోటివ్ రైలు పొగలు కక్కుతూ, కూ.. అంటూ కూతవేస్తూ లాగేది. 1960ల చివర్లో టాటా కంపెనీ టెల్కో, జంషెడ్‌పూర్‌లో ఈ YP ఇంజిన్ తయారు చేసిందని IRAS అనంత్ తెలిపారు. తను ఉద్యోగంలో చేరిన సమయంలో రైల్వే అనుభూతులను గుర్తు చేసుకున్నారు.
News October 30, 2025
HYD: గర్ల్‌ఫ్రెండ్‌పై యువకుడి పైశాచికం

గర్ల్‌ఫ్రెండ్‌పై యువకుడి పైశాచిక తీరు ఒళ్లు గుగురుపొడిచేలా చేసిన ఘటన పంజాగుట్ట PSలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. గుంటూరు యువతి సోమాజిగూడలో ఉంటోంది. నిందితుడు భానుప్రకాశ్, యువతి ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 26న ఆమె రూమ్‌కి వెళ్లాడు. లైంగికదాడి చేసి గోర్లు పీకి, కత్తెరతో ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా రిమాండ్‌కు తరలించారు.
News October 30, 2025
HYD: BJP చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందే: మహేశ్

బీజేపీ చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కలలు కన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరించే పార్టీ.. మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీజేపీకి ఫ్యూచర్లో ఏ పనిలేక చివరికి చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని ఘాటుగా విమర్శించారు.


