News June 20, 2024
HYD: కాచిగూడలో మృతదేహం కలకలం..!
HYD కాచిగూడలో రైలు పట్టాల వద్ద ఓ యువకుడి మృతదేహం కలకలం సృష్టించింది. రైల్వే ఇన్‌స్పెక్టర్ ఆర్.ఎల్లప్ప తెలిపిన వివరాలు.. రైలు పట్టాల వద్ద అనుమానాస్పద స్థితిలో ఓ యువకుడి మృతదేహం ఉందని సిబ్బంది రైల్వే పోలీసులకు సమచారం ఇచ్చారు. వారు వెళ్లి పరిశీలించి, పాతబస్తీకి చెందిన కిజార్(22)గా అతడిని గుర్తించారు. కాగా ఇది హత్యనా.. ఆత్మహత్యనా.. రైలు ఢీకొని చనిపోయాడా.. అనేది పోస్టుమార్టంలో తెలుస్తుందన్నారు.
Similar News
News September 19, 2024
HYDలో ఇదీ పరిస్థితి..!
HYDలో గణేశ్ ఉత్సవాలు మొదలయ్యాక భారీగా వ్యర్థాల సేకరణ పెరిగిందని అధికారిక గణాంకాలు వెల్లడించారు. ఆగస్టులో సగటున 7,900 మెట్రిక్ టన్నుల వ్యర్థాలు వెలువడితే, చవితి రోజు 8337.96 మె.టన్నులు సేకరించినట్లు తెలిపారు. 11తేదీన 8810.10 మె.టన్నులు, 17న 8547.58 మె.టన్నులు సేకరించారు. కాగా మంగళ, బుధవారాల్లో పోగైనది సేకరిస్తున్నారు. ఇందులో అత్యధికంగా కలర్ పేపర్లు, పూజా వ్యర్థాలే ఉన్నట్టు తెలిపారు.
News September 19, 2024
HYD: గణనాథుడిని దర్శించుకున్న KTR
వినాయకచవితి ఉత్సవాల్లో భాగంగా HYD కుషాయిగూడలోని TSIIC కాలనీలో BRS రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో యువసేన యూత్ అసోసియేషన్ వారు భారీ గణనాథుడిని ప్రతిష్ఠించారు. బుధవారం వినాయకుడి ప్రత్యేక పూజలో BRS పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ KTR, ఉప్పల్ నియోజకవర్గ MLA బండారి లక్ష్మారెడ్డి, పలువురు కార్పొరేటర్లు, BRS పార్టీ నాయకులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
News September 19, 2024
HYD: హృదయవిదారకం.. ప్రాణం తీసిన ఆకలి!
హైదరాబాద్ శివారులో బుధవారం హృదయవిదారక ఘటన వెలుగుచూసింది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి తొండుపల్ల మసీదు వద్ద గుర్తు తెలియని మృతదేహం లభ్యమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. యాచకుడిగా గుర్తించి మృతదేహాన్ని ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించారు. అయితే, గత కొన్ని రోజులుగా ఆకలితో అలమటిస్తూ ఆ వృద్ధుడు చనిపోయినట్లు తెలుస్తోంది. ఇది విన్న స్థానికులు చలించిపోయారు.