News April 1, 2025

HYD: కారులో జర్మనీ యువతితో అసభ్య ప్రవర్తన

image

మీర్‌పేటలో కలకలం రేగింది. తన స్నేహితురాలిని కలిసేందుకు వచ్చి తిరిగి వెళుతున్న క్రమంలో జర్మనీకి చెందిన యువతి మందమల్లమ్మ వద్ద కారు ఎక్కింది. కొద్దిదూరం వెళ్లాక క్యాబ్ డ్రైవర్, అందులో ఉన్న వ్యక్తి పహాడి‌షరీఫ్ ప్రాంతంలో ఆమెపై అసభ్యకరంగా ప్రవర్తించారు. బాధితురాలు తప్పించుకొని పారిపోయింది. మీర్‌పేట PSలో ఫిర్యాదుచేయగా కేసు నమోదు చేసి పహాడీషరీఫ్ పోలీసులకు బదిలీచేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Similar News

News November 18, 2025

శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానం

image

సౌదీ అరేబియాలో జరిగిన ప్రమాద ఘటన బాధితుల కోసం ప్రభుత్వం శంషాబాద్ నుంచి సౌదీకి ప్రత్యేక విమానాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారిని గుర్తించి, అంతిమ సంస్కారాలు నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. మృతుల రక్త సంబంధికులను ఈరోజు రాత్రి 8.30 గంటలకు నాంపల్లి హజ్ హౌస్ నుంచి సౌదీకి పంపనున్నారు.

News November 18, 2025

శంషాబాద్‌: గర్భంలోనే కవలలు మృతి.. భర్త ఆత్మహత్య

image

భార్య గర్భంలోని కవలలు మృతిచెందారనే దుఃఖంతో శంషాబాద్‌లోని సామ ఎన్‌క్లేవ్‌లో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆతహత్య చేసుకున్నాడు. పోలీసుల ప్రకారం.. కర్ణాటకకు చెందిన ముత్యాల విజయ్ భార్య శ్రావ్య 8 నెలల గర్భిణీ. కవలల మరణ వార్త తెలిసి విజయ్ తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. శంషాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.