News July 1, 2024
HYD: కార్ సీఎన్జీ కిట్‌లో గంజాయి అమర్చి అడ్డంగా బుక్కయ్యాడు

ఎల్బీనగర్ ఎస్ఓటి, నాగోల్ పోలీసులు సంయుక్తంగా వాహనాల తనిఖీలు నిర్వహించారు. నాగోల్ చౌరస్తాలో నిజామాబాద్ నుంచి హైదరాబాద్ వస్తున్న కారుని అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్ ప్రాంతానికి చెందిన బోయినపల్లి సురేష్ తన కారులోని సీఎన్జీ గ్యాస్ కిట్‌లో గంజాయి అమర్చుకొని తరలిస్తుండగా అదుపులోకి తీసుకున్నారు. నిజామాబాద్‌తో పాటు.. పలు పీఎస్‌లలో సురేష్‌పై గంజాయి పాత కేసులు ఉన్నట్లు గుర్తించారు.
Similar News
News October 30, 2025
HYD: గర్ల్‌ఫ్రెండ్‌పై యువకుడి పైశాచికం

గర్ల్‌ఫ్రెండ్‌పై యువకుడి పైశాచిక తీరు ఒళ్లు గుగురుపొడిచేలా చేసిన ఘటన పంజాగుట్ట PSలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. గుంటూరు యువతి సోమాజిగూడలో ఉంటోంది. నిందితుడు భానుప్రకాశ్, యువతి ఒకే కంపెనీలో పనిచేస్తున్నారు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి 26న ఆమె రూమ్‌కి వెళ్లాడు. లైంగికదాడి చేసి గోర్లు పీకి, కత్తెరతో ప్రైవేట్ భాగాలపై దాడి చేశాడు. యువతి పోలీసులకు ఫిర్యాదు చేయగా రిమాండ్‌కు తరలించారు.
News October 30, 2025
HYD: BJP చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందే: మహేశ్

బీజేపీ చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని టీపీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. మూడు నెలల్లో ప్రభుత్వం కూలిపోతుందని కలలు కన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలను ఆదరించే పార్టీ.. మైనార్టీకి మంత్రి పదవి ఇస్తే తప్పేంటి? అని టీపీసీసీ చీఫ్ ప్రశ్నించారు. బీజేపీకి ఫ్యూచర్లో ఏ పనిలేక చివరికి చిలుక జోష్యం చెప్పుకోవాల్సిందేనని ఘాటుగా విమర్శించారు.
News October 30, 2025
ఆరుట్ల బుగ్గజాతరకు ఇలా వెళ్లండి

దక్షిణ కాశీగా పేరుగాంచిన <<18145591>>ఆరుట్ల బుగ్గరామలింగేశ్వర స్వామి<<>> జాతర NOV 5 నుంచి ప్రారంభం కానుంది. ఈ సన్నిధిలో తూర్పునుంచి పడమరకు నీరు ప్రవహించడం ప్రకృతి అద్భుతం. ఇక్కడికి ఎల్బీనగర్, పెద్దఅంబర్‌పేట్ నుంచి వెళ్లొచ్చు. ఎల్బీనగర్ నుంచి ఇబ్రహీంపట్నానికి వెళ్లాలి. అక్కడి నుంచి ఆరుట్ల, బుగ్గతండాకు బస్సులు, ఆటోలుంటాయి. స్వయానా రామయ్యే ప్రతిష్ఠించడం, బుగ్గతండాలో ఉండటంతో బుగ్గరామలింగేశ్వర స్వామిగా పిలుస్తుంటారు.


