News August 24, 2024
HYD: కాలేయ మార్పిడి కోసం ఎదురుచూపులు..!

HYD నగరంలోని ఉస్మానియా, గాంధీ, NIMS ఆస్పత్రుల్లో కాలేయ మార్పిడి కోసం రోగులు ఏళ్లుగా వేచి చూస్తున్నారు. లాస్ట్ స్టేజ్ సిరోసిస్ లాంటి వ్యాధులతో బాధపడుతున్న వారికి కాలేయ మార్పిడే చివరి ఆశ. ఉస్మానియాలో కాలేయ మార్పిడి కోసం వందల మంది వేచి చూస్తున్నారు. కాలేయ మార్పిడి జరిగితే తప్ప బతకడం కష్టమని రోగుల కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News November 20, 2025
HYD: ఫేక్ ఎన్కౌంటర్లను పూర్తిగా ఖండిస్తున్నాం: టీపీసీసీ చీఫ్

మావోయిస్టుల ఫేక్ ఎన్కౌంటర్లను పూర్తిగా ఖండిస్తున్నామని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. గురువారం HYD ముగ్దుం భవన్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. ‘కగార్పై మాట్లాడితే దేశ ద్రోహి ముద్ర వేశారు.. ప్రజా జీవన స్రవంతిలోకి వస్తామని సర్వం కోల్పోయిన వారు చెబుతుంటే కక్ష్య పూరితంగా అంతమొందిస్తున్నారు.. హింసను కాంగ్రెస్ పార్టీ సమర్థించదు’ అని ఆయన పేర్కొన్నారు.
News November 20, 2025
HYD: సౌదీలో మృతదేహాలకు రేపు అంత్యక్రియలు: అజహరుద్దీన్

సౌదీలో ఇటీవల జరిగిన బస్సు ప్రమాదంలో మృతిచెందిన వారికి రేపు అంత్యక్రియలు చేయనున్నట్లు మైనారిటీ శాఖ మంత్రి అజహరుద్దీన్ తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, తెలంగాణ మంత్రి అజహరుద్దీన్, ఎమ్మెల్యే మజీద్ హుస్సేన్ సౌదీ అధికారులతో సుదీర్ఘ చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. కాగా మృతుల కుటుంబసభ్యులు సైతం సౌదీకి చేరుకున్నారు.