News February 28, 2025
HYD: కాళోజీ అవార్డు గ్రహీత జయరాజు పదవీ విరమణ

బజార్ ఘాట్‌లోని సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ భవన్‌లో సింగరేణి కార్మికుడు, ప్రముఖ కవి, సినీగేయ రచయిత, కాళోజీ అవార్డు గ్రహీత, తెలంగాణ ఉద్యమకారుడు జయరాజు పదవీ విరమణ జరిగింది. ఈ పదవీ విరమణ సభకు ముఖ్యఅతిథిగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పాల్గొని అభినందనలు తెలిపారు. అనంతరం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌కు శాలువాతో సన్మానించారు.
Similar News
News December 19, 2025
మరికల్: ఆ పల్లెకు సర్పంచ్‌లుగా నాడు తల్లి.. నేడు తనయుడు

మరికల్ మండలం వెంకటాపూర్ గ్రామ పంచాయతీలో తల్లి వారసత్వాన్ని కుమారుడు నిలబెట్టుకున్నారు. 2019లో ఈ పంచాయతీ నూతనంగా ఏర్పడగా, తొలి సర్పంచ్‌గా కళావతమ్మ ఎన్నికయ్యారు. తాజాగా జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఆమె తనయుడు విజయ్ కుమార్ రెడ్డి తన ప్రత్యర్థిపై 111 ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. తల్లి హయాంలో జరిగిన అభివృద్ధిని మరింత ముందుకు తీసుకెళ్తానని ఈ సందర్భంగా విజయ్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు.
News December 19, 2025
రోజూ గుడ్లు పెట్టే కోళ్ల గురించి తెలుసా?

పౌల్ట్రీ పరిశ్రమలో అధిక గుడ్ల ఉత్పత్తికి ప్రసిద్ధి చెందాయి BV 380 రకం కోళ్లు. ఇవి వేడి, తేమ వాతావరణాలకు అనుకూలంగా ఉంటాయి. సంవత్సరానికి 308 గుడ్లు పెట్టడం ఈ కోళ్ల ప్రత్యేకత. BV 380 కోడి పిల్లలను 18 నుంచి 20 వారాల పాటు పెంచిన తర్వాత గుడ్లను పెట్టడం ప్రారంభిస్తాయి. గోధుమ రంగులో ఉండే ఈ గుడ్లు పెద్దగా ఉంటాయి. ఇవి ఏడాది పాటు గుడ్లు పెట్టి తర్వాత ఆపేస్తాయి. అప్పుడు వాటిని మాంసం కోసం విక్రయించవచ్చు.
News December 19, 2025
మరికల్: ఒకే పంచాయతీకి ఉపసర్పంచులుగా నాడు భర్త.. నేడు భార్య

మరికల్ మండలం గాజులయ్యతండాకు చెందిన దంపతులు అరుదైన గుర్తింపు పొందారు. 2019లో బుడ్డగానితండా నూతన పంచాయతీగా ఏర్పడగా.. భాస్కర్ నాయక్ వార్డు సభ్యుడిగా గెలిచి, తొలి ఉపసర్పంచ్‌గా పనిచేశారు. తాజాగా జరిగిన పంచాయతీ ఎన్నికల్లో ఆయన భార్య జమున గాజులయ్యతండా నుంచి వార్డు సభ్యురాలిగా ఏకగ్రీవమై, అనంతరం బుడ్డగానితండా ఉపసర్పంచ్‌గా ఎన్నికయ్యారు. దీంతో ఒకే పదవిని భార్యాభర్తలు అలంకరించడం విశేషం.


